ఇవాళ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ఇక పవన్ బర్త్ డే కావడంతో తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి.అంతేకాదు తమ్ముడు, జల్సా సినిమాలు రీరిలీజ్ కావడం కూడా అభిమానుల ఆనందానికి ఒక విధంగా కారణమైంది.ఇకపోతే భవిష్యత్తులో ఖుషి సినిమా 4కే ప్రింట్ రీరిలీజ్ చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక ఈ మధ్య కాలంలో పవన్ ఆస్తుల గురించి ఎన్నో వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.ఇదిలావుంటే తాజాగా నాగబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేయడం సులువైన విషయం కాదని ఆయన అన్నారు.
అంతేకాదు మాకు తాతలు సంపాదించిన వేల కోట్ల రూపాయల ఆస్తులేం లేవని ఆయన తెలిపారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోల కంటే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎక్కువని ఆయన కామెంట్లు చేశారు.కాగా అయినప్పటికీ పవన్ కళ్యాణ్ దగ్గర ఇంత ఆస్తి ఉందని చెప్పుకునే పరిస్థితి లేదని నాగబాబు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన డబ్బంతా రాజకీయాలకు, సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తున్నారని నాగబాబు అన్నారు.కాగా డబ్బును మాత్రం పవన్ దాచిపెట్టి ఆస్తులు కొనుగోలు చేయరని నాగబాబు తెలిపారు. ఇకపోతే శంకర్ పల్లిలో పవన్ ఎప్పుడో కల్టివేట్ చేద్దామని 8 ఎకరాలు కొనుగోలు చేశారని..
ఆ ల్యాండ్ విలువ పెరిగిందని నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ ఇల్లు కొన్నారని అయితే పవన్ ఎన్ని కొన్నా ఫైనాన్స్ తీసుకుని కొన్నారని నాగబాబు తెలిపారు.ఇక ప్రతి నెలా వాయిదాల పద్ధతిలో పవన్ కళ్యాణ్ డబ్బు చెల్లిస్తూ అప్పు తీరుస్తున్నారని నాగబాబు కామెంట్లు చేశారు.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ దగ్గర సాలిడ్ గా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే లేదని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తారని మొదట నాకు తెలియదని నాగబాబు వెల్లడించారు.కాగా పవన్ ఆస్తులకు సంబంధించి నాగబాబు సంచలన విషయాలను వెల్లడించారు..!!