షాక్:అంకుల్ అంటే కేసు పెడతానంటున్న బ్రహ్మాజీ..!!

Divya
ప్రముఖ నటుడు అయిన బ్రహ్మాజీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ అయినా సరే ఎంతో ఫన్నీగా వ్యవహరిస్తూ ఉంటారు బ్రహ్మాజీ. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే బ్రహ్మాజీ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు అభిమానులతో. ఎప్పటికప్పుడు తనదైన చమత్కారమైన ట్వీట్ లతో,  సెటైర్లతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటాడు.. ఏజ్ అనేది కేవలం జస్ట్ నెంబర్ మాత్రమే అని మన టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, నాగార్జునను చూస్తే మనకి అర్థమవుతుంది.

బ్రహ్మాజీ కూడా ఇదే బాటలో ఇప్పుడు పయనిస్తూ ఉన్నారు.. ఎప్పటికీ యంగ్ గా కనిపించడమే కాకుండా తన నటనతో ఎంతో మంది ఆడియన్స్ ను కూడా అలరిస్తూ ఉంటారు బ్రహ్మజీ. తన వయసు కంటే చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు ఈ నటుడు. బ్రహ్మాజీ తనపై తాను కొన్ని ఫన్నీ కామెంట్లు కూడా చేసుకోవడానికి వెనుకాడడు.. తరచూ  యాంకర్ సుమ మరియు ఇతర స్టార్ హీరోలతో కలిసి స్టేజిలపైన పలు కామెంట్లు చేస్తూ నవ్విస్తూ ఉంటారు. అయితే తనని అంకుల్ అని పిలిస్తే మాత్రం కేసు వేస్తానని తెలియజేస్తున్నారు బ్రహ్మాజీ.


నిన్నటి రోజున సాయంత్రం ఒక సెల్ఫీ ఫోటోని షేర్ చేయగా.. వాట్స్ హ్యాపెనింగ్ అనే క్యాప్షన్ కూడా షేర్ చేశారు బ్రహ్మాజీ .. అది చూసిన ఒక నెటిజన్ ఏం లేదు అంకుల్ అని బదులు ఇచ్చారు.. ఆ రిప్లై చూసిన బ్రహ్మాజీ ఆ ట్విట్ కు రిప్లై ఇస్తూ .. అంకుల్ ఏంట్రా.. అంకుల్ .. కేసు వేస్తా.. ఏజ్, బాడీ షేవింగ్ చేస్తున్నావా అంటూ నవ్వుతున్న ఒక ఎమోజిని షేర్ చేశారు. ఈ ట్విట్ కాస్త క్షణాలలో వైరల్ గా మారింది. అభిమానులు బ్రహ్మాజీ ట్వీట్ కు సరదాగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఫన్నీ మీమ్స్ తో సందడి చేస్తూ ఆన్లైన్లో రూలింగ్ గురించి ఇటీవల జరిగిన వివాదం గురించి విశ్లేషించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: