టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణంరాజు రెబల్ స్టార్ గా పేరు సంపాదించారు.. కానీ కన్నడ ఇండస్ట్రీలో అంబరీష్ రెబల్ స్టార్ గా పేరు సంపాదించారు. అలనాటి హీరోయిన్ సుమలతని ఆయన వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇక 2018లో అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో తన భర్త ప్రాతినిధ్యం వహించిన వాటి నుంచి సుమలత ఇండిపెండెంట్ గా పోటి చేసి ఎంపీగా గెలిచింది. ఇక తన కుమారుడు అభిషేక్ ని హీరోగా పరిచయం చేయడం జరిగింది. ఇక అమర్ పేరుతో రూపొందిన మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.. దీంతో రాక్ లైన్ వెంకటేష్ నిర్మాణంలో శనివారం ఒక కొత్త సినిమాను ప్రారంభించారు..
ఆగస్టు 27న సుమలత జన్మదినం సందర్భంగా అభిషేక్ అంబరీష్ హీరోగా..AA -04 అని వెరైటీ టైటిల్తో ఒక సినిమాని మొదలుపెట్టారు. మహేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్ అంబరీష్ వారియర్ గా, గ్లాడియేటర్ లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక అందుకు సంబంధించి పలు పోస్టర్ని కన్నడ హీరో దర్శన్ సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. పోస్టర్లో అభిషేక్ అంబరీష్ గ్లాడియేటర్ తరహాలో కాస్ట్యూమ్స్ ధరించినట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటో ప్రతి ఒక్కరినే కూడా బాగా ఆకట్టుకుంటోంది.
యంగ్ రెబల్ స్టార్ అంటూ పోస్టర్ పైన టైటిల్ని వేయడంతో అందరూ కూడా జూనియర్ రెబల్ స్టార్ అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇంటెన్స్ లుక్ లో అభిషేక్ అంబరీష్ కనిపిస్తున్న పోస్టర్లు బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఈ చిత్రం పిరియాడిక్ డ్రామానా.. లేదంటే కే జి ఎఫ్ తరహాలో సాగే సినిమాన అన్నట్టుగా ప్రేక్షకులకు సందేహాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో నటించే నటీనటుల సాంకేతిక నిపుణులను త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర బంధం తెలిపారు అభిషేక్ అంబరీష్ నటించిన నాలుగవ సినిమా ఇది కావడం గమనార్హం. ఇక ఈ సినిమాకి కేజిఎఫ్ సంగీతాన్ని అందించిన రవి బాసు సంగీతాన్ని అందిస్తున్నారు.