కావలసిన అందం ఉన్న..ఈ ముద్దుగుమ్మకు అందని హిట్.. మరీ..!!
అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు పలు సినిమాలలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. రవితేజ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది ఇక రీసెంట్ గా వచ్చిన తీస్మార్ ఖాన్ చిత్రం చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాలో హీరోగా ఆది సాయికుమార్ నటించారు. అందం అభినయం ఉన్న ఈ భామకు ఈ సినిమా కూడా కలిసి రాలేదని చెప్పవచ్చు. దీంతో ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా పైన పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం.. జిన్నా . ఈ సినిమాతో సూర్య అనే ఒక నూతన డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నది. అలాగే ఈ సినిమాలో మరొక హాట్ బ్యూటీ సన్నీలియోన్ కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్ లో నటిస్తున్నది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ప్రస్తుతం చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసిత మంచి విష్ణు ఈ సినిమాని చాలా కసిగా తెరకెక్కిస్తున్నారు అలాగే పాయలు కూడా ఈ సినిమాలో సక్సెస్ కొట్టాలని చూస్తున్నది మరి వీరిద్దరి ఆశలని ఈ జిన్నా సినిమా నిలబెడుతుందేమో చూడాలి.