ట్రైలర్: రంగ రంగ వైభవంగ.. అద్భుతంగా ఉన్న ట్రైలర్..!!
రీసెంట్ గా విడుదలైన టీజర్ దేవిశ్రీప్రసాద్ అందించిన లిరికల్ వీడియోలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇక పాటల్లో వైష్ణవ తేజ్ ,కేతిక శర్మల మధ్య కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంటోంది. తాజా ఈరోజున ఈ సినిమా ట్రైలర్ చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది చిన్నతనం నుంచి ఒకరంటే ఒకరికి గొడవలు జరుగుతూ ఉండే నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ను తెరకెక్కించారు. చివరికి ఇద్దరు తమ యుగో పక్కన పెట్టి ఎలా ఒకటయ్యారా అన్నది ఈ సినిమా కదా అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రతి ఒక్క డైలాగు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా చేస్తుంది.
ఇక ఈ ట్రైలర్ లో చూపించిన విధంగా ఇరువురి కుటుంబాల మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చోటుచేసుకుంటాయి ఆ తర్వాత ఏమవుతుంది అనే విషయంపై చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక వీరిద్దరి ప్రేమ కథ తెలుసుకోవాలి అంటే సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ఆగాల్సిందే ఇందులో కీలకమైన పాత్రలో మాత్రం హీరో నవీన్ చంద్ర నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటూ ఉంటోంది.