వామ్మో: సెప్టెంబర్ నెలలో ఒకేసారి ఇన్ని చిత్రాలా..!!
ఇక ఇప్పుడు టాలీవుడ్ చిత్ర నిర్మాతలు సైతం సెప్టెంబర్ నెలలో రాబోయే సినిమాల పైన బాగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తున్నది. ఇక సెప్టెంబర్ నెలలో ఒకేసారి చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అందులో ముఖ్యంగా సెప్టెంబర్-2 వ తేదీన మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న రంగ రంగ వైభవంగా సినిమా విడుదల కాబోతోంది. ఇక సెప్టెంబర్-9 న తేదీన తమన్నా సత్యదేవ్ కాంబినేషన్లో వస్తున్న గుర్తుందా శీతాకాలం చిత్రం విడుదల కాబోతోంది. అలాగే హీరో శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం చిత్రం కూడా విడుదల కాబోతున్నాయి.
ఇక వీటితో పాటు యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని, నిఖిల్ అనుపమ జంటగా నటించిన 18 పేజీస్ , రెజీనా నటించిన షాకిని డాకిని, ఇక కృతి శెట్టి, సుధీర్ బాబు కలిసి నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలాంటి చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇక ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలు కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ నెల అంతా సినీ ప్రియులకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరికిందని చెప్పవచ్చు. మరి ఇందులో ఏ చిత్రాలు సక్సెస్ అవుతాయో చూడాలి.