లైగర్-2 పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!!
ఇక అందాల హీరోయిన్ అనన్య పాండే కూడా పూజ కార్యక్రమంలో పాల్గొన్నది ఇక దీంతో పాటుగా విజయ్ దేవరకొండ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకున్న ఫోటోలు తాజా వైరల్ గా మారాయి. తన ట్విట్టర్లో విజయ్ అనన్యత కలిసి ఉన్న పూజా కార్యక్రమంలోని ఫోటోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇక విజయ్ తన తల్లి నుండి ఆశీర్వాదాలు అందుకున్నారు లైగర్ సినిమా కోసం హైదరాబాదులోని విజయ్ ఇంట్లో పూజ కార్యక్రమాలు జరిగాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా అని హింట్ కూడా ఇచ్చినట్లు మీడియా వర్గాలలో టాక్ వినిపిస్తోంది.
ఇక ధర్మ ప్రొడక్షన్ అధినేత పైనా లైగర్ పైనా గౌరవం ఆసక్తి గురించి కూడా మాట్లాడడం జరిగింది. పరిశ్రమను నడిపిస్తున్న ఒకే ఒక వీరుడు కరుణ్ జోహార్ పై విజయ్ ప్రశంసలు కురిపించారు ఇక లైకర్లో రమ్యకృష్ణ, రోనిత్ రామ్, ఆలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శీను తదితరులు కూడా ఈ సినిమాలో కీలకపాత్రను నటిస్తున్నారు ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కించడం జరిగింది ఇందులో లెజెండ్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.