'కార్తికేయ 2' నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి అసలు కారణం అదేనా..?

Anilkumar
ప్రస్తుతం కార్తికేయ 2 పేరు  దేశం అంతటా మారుమోగి పోతుంది.అయితే  నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా కార్తికేయ 2. నిఖిల్ కెరీర్ లోనే కార్తికేయ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇకపోతే ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించారు.కాగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ అయ్యింది.అయితే ఇక ముందు నుండి కూడా ఆడియెన్స్ కార్తికేయ 2 పై కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. 

పోతే ఈ సినిమా ఆగష్టు 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ లో వండర్ క్రియేట్ చేస్తుంది.. కాగా  అక్కడ మార్కెట్ లో కార్తికేయ 2 కు భారీ డిమాండ్ నెలకొంది.. సౌత్ నుండి అది కూడా మన టాలీవుడ్ నుండి మరో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా రావడంతో అక్కడి ప్రేక్షకులను మెప్పిస్తుంది..ఇక  అక్కడి పెద్ద సినిమాలను కూడా పట్టించు కోకుండా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.పోతే రోజురోజుకూ స్క్రీన్ లు పెంచుకుంటూ పోతున్నారు.అయితే  మన సౌత్ లో కూడా ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించలేదు..ఇక  మరి అంతలా నార్త్ ప్రేక్షకులను అలరించడానికి కారణం ఏంటా అని అందరు ఆరా తీస్తున్నారు.

అంతేకాదు  శ్రీకృష్ణుడి రహస్యాల నేపథ్యంలో తెరకెక్కడం వల్ల ఈ సినిమా మరింత ఆకట్టుకుంటుంది అని చెబుతున్నారు.కాగా ఉత్తరాది ప్రజలు ఎక్కువుగా కృష్ణుడిని ఆరాధిస్తారు.. మరి ఈ సినిమాలో కృష్ణుడి ఔనత్యాన్ని చాటి చెప్పే ఒక సీన్ కూడా ఉంది. అయితే ఆ సీన్ కారణంగానే అక్కడి ప్రేక్షకులు సినిమాను చూస్తున్నారని..ఇక  ఇది ఒక సినిమాకు సీక్వెల్ అని కూడా అక్కడి వారికి తెలియదు అని అంటున్నారు. అయితే మొత్తానికి ఉత్తరాది ప్రజల కారణంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ లలో ఒకటిగా చేరిపోయింది. ఇకపోతే ఇదే స్పీడ్ కొనసాగితే పెట్టుబడికి డబల్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: