అగ్గిపెట్టె చీరలు రమ్యకృష్ణ హోయలు.. వీడియో వైరల్..!!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం 60 సంవత్సరాల వయసులో కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉన్న నటిమనులు చాలామందే ఉన్నారు.. ఇక అలనాటి హీరోయిన్ శ్రీదేవి, హేమమాలిని, మాధురి దీక్షిత్ అంతగా మెయింటైన్ చేశారు ఆ తర్వాత స్థానంలో రమ్యకృష్ణ ఉందని చెప్పవచ్చు. ఇక రమ్యకృష్ణ ఏజ్ ఆఫ్ సెంచరీ దాటిన ఇప్పటికీ తనలోని అందచందాలు మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు ఇప్పటికీ కూడా అదే స్పీడ్ తో జోర్ కొనసాగిస్తూ ఉన్నది. ఈ మధ్యకాలమే లైగర్ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది.

ఇక లైగర్ సినిమా ట్రైలర్లు ఎంతో జోరుగా కూడా కనిపించింది రమ్యకృష్ణ బాహుబలి శివగామి పాత్ర తర్వాత మళ్లీ లైగర్ సినిమాలో అంతటి పాత్ర గుర్తింపు తెచ్చే విధంగా నటించిందని చెప్పవచ్చు. ట్రైలర్ లో చూపించిన  విధంగా ఎంతో ఎమోషనల్తో పర్ఫామెన్స్ చేసి బాగా ఆకట్టుకునేలా ఉందని రమ్యకృష్ణ చెప్పవచ్చు. ఇక లైగర్ సినిమా ప్రమోషన్స్ ఎక్కువగా ముంబైలోనే జోరుగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక తాజాగా రమ్యకృష్ణ బాలీవుడ్ మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఇక ఆ సమయంలో చీరలు చాలా కోయలు పలుకుతూ ఉన్న ఫోటోషూట్ కి ఫోజులు ఇచ్చింది అగ్గిపెట్టెలో పట్టే అంతటి లైట్ వెయిట్ చీర గాలికి అలా ఎగురుతూ ఉంటే రమ్యకృష్ణ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది.
ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తూనే ఈ పలచని చీరలో రమ్యకృష్ణ చాలా ప్రత్యేకంగా ఉన్నదని చెప్పవచ్చు. అప్పుడెప్పుడో అగ్గిపెట్టలో పట్టే అంత చీరని వేసుకొని ఇందిరమ్మకు కానుక ఇచ్చారు ఇప్పుడు రమ్యకృష్ణకు కూడా అలాంటి అరుదైన చీర లో చాలా హోయలు పలుకుతోంది అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటో షూట్ తో రమ్యకృష్ణ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు హీరోయిన్ అయ్యుండి రమ్యకృష్ణకు బాలీవుడ్లో ఇంత గొప్ప గుర్తింపు రావడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇక లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదలవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: