
రవితేజ - బాలకృష్ణ కాంబినేషన్ సెట్ చేస్తున్న డైరెక్టర్..!!
ఒక ప్రస్తుతం బాలకృష్ణ సక్సెస్ ట్రాక్ బాగా ఉండటంతో తన సినిమా షూటింగ్ దశలో ఉండంగానే మరొక సినిమా లో నటించే అవకాశం ఉన్నది. తాజాగా సోలో హీరోగా కాకుండా మల్టీ స్టారర్ సినిమాలో నటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ, రవితేజ కథానాయకులుగా ఒక మల్టీ సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచనలు గోపీచంద్ కు మొదలైనట్లు ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని లీక్ చేయడం జరిగింది. అయితే గోపీచంద్ కు ఇలాంటి ఆలోచన రావడానికి ముఖ్య కారణం బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక గతంలో కూడా బాలకృష్ణ రవితేజ కలిసి అన్ స్టాపబుల్ షో లో పాల్గొని వారి యొక్క వ్యక్తిగత విషయాలను తెలియజేశారు. దీంతో వీరిద్దరి మనస్తత్వం ఒకే విధంగా ఉండడంతో వీరిద్దరిని అన్న తమ్ముళ్ల గా వీరి అభిమానుల సైతం భావిస్తున్నారు. ఇక బాలకృష్ణ, రవితేజ మధ్య వ్యక్తిగతంగా పలు విషయాలు మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు సమాచారం. దీంతో డైరెక్టర్ గోపీచంద్ వీరిద్దరిని దగ్గర నుండి చూశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరితో కలిసి ఒక కమర్షియల్ సినిమా చేస్తే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని డైరెక్టర్ భావిస్తున్నట్లుగా సమాచారం. వీరిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఒక కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.