తన దృష్టిలో వారంతా పని పాట లేని వారే అంటున్న రవితేజ.. కారణం..?
ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరోలలో రవితేజ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇదంతా కేవలం క్రాక్ సినిమా ఇచ్చిన ధైర్యమే అని చెప్పవచ్చు. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఇక ఎక్కువగా తన తదుపరి సినిమాల పైన ఫోకస్ పెడుతూ ఒకేసారి ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక అలాంటి సమయంలోనే రవితేజ పైన కొన్ని రూమర్లు రావడం కూడా జరిగాయి.
అందులో ముఖ్యంగా ఖిలాడి సినిమా సమయంలో డైరెక్టర్ తో రవితేజకు కాస్త భేదాభిప్రాయాలు వచ్చాయనే టాక్ వినిపించింది. అందుకు తగ్గట్టుగానే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ స్పీచ్ అలా ఉన్నది అయితే ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇలాంటి సమయంలో రవితేజ పై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. రామారావు ఆన్ డ్యూటీ చిత్రం వాయిదా పడిన తర్వాత రవితేజ రీ షూటింగ్ కోసమే ఎక్కువ రెమ్యూనరేషన్ అడుగుతున్నాడని లేకపోతే డబ్బింగ్ చెప్పడానికి రానని చెప్పినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
దీంతో ఈ సినిమా విడుదల ఆలస్యం కావడానికి కారణం ఇదే అన్నట్లుగా సమాచారం అంతేకాకుండా ప్రమోషన్ పనులు కూడా రాలేదని పలు రకాలుగా రూమర్లు వస్తున్నాయి. ఇదే విషయంపై తాజాగా రవితేజ ఒక ఇంటర్వ్యూలో అడగగా. నిర్మాత సుధాకర్ చేకూరితో రెమ్యూనరేషన్ విషయంలో అసలు ఎలాంటి సమస్య లేదు.. ఇవన్నీ ఎవరో పని పాట లేని వారు సృష్టించిన వార్తలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు ఇలాంటి రూమర్స్ ఇది మొదటిసారి కాదు చాలాసార్లు వినిపించాయి. కొంతమంది బ్యాచ్ ఉంటారు వీళ్ళకి పని పాట అనేది అసలు ఉండదు వాళ్ళు అన్ని సృష్టించి ఏదేదో రాస్తుంటారు వాటిని అసలు పట్టించుకోకూడదు నేను ఈ వార్తలు చదివినప్పుడు నవ్వుతూ వెళ్ళిపోతానని తెలిపారు. నిర్మాత సుధాకర్ నాకు చాలా మంచి స్నేహితులు. సుధాకర్ కు నాతోనే కాదు ఎవరితోని ఇలాంటి సమస్య ఉండదని తెలిపారు.