అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్..!!

Divya
అల్లు అర్జున్ అభిమానులకు ఇది ఒక శుభమైన వార్త అని చెప్పవచ్చు... డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటించింది. ఈ సినిమా ఒకేసారి తెలుగు తమిళ్, మలయాళం కన్నడ, హిందీ వంటి భాషలలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దాదాపుగా రూ. 350 కోట్ల రూపాయలు వసూలు చేసి తెలుగు సినిమా మొత్తం చాటుకుంది. ఈ సినిమాలో పుష్ప రాజుగా అల్లు అర్జున్ అద్భుతమైన నటనని ప్రదర్శించారు దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి.


ఈ నేపథ్యంలోని ఈ సినిమా పాటలు కూడా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ పై మరింత ఆశలు నెలకొన్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కు వెళ్లనుంది. పుష్ప మొదటి భాగంలో నటించిన వాళ్ళు ఇద్దరు కీలకమైన పాత్రలు నటించబోతున్నారు కాదా ఇప్పుడు పుష్ప మూడవ పార్ట్ కూడా ఉండబోతుందని వార్త తెలియజేశారు సాహద్ ఫాజిల్. (బన్వర్సింగ్ షెకావత్). తాజాగా ఈ మేరకు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈయన ఈ విషయాన్ని రిలీవ్ చేయడం జరిగింది.


పుష్ప సినిమా రెండో పార్ట్ ఆగేది కాదని మూడో పార్ట్ కూడా ఉండబోతోందని తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూలో ఫాహద్  మాట్లాడుతూ.. మొదట పుష్ప ఒక పాటతోనే ముగించాలని సుకుమార్ ప్లాన్ చేశారు అయితే సినిమా మొత్తం పూర్తి అయ్యాక రెండు భాగాలు సరిపోయేంత వచ్చిందని తెలియజేశారట దీంతో పుష్పటూ కూడా ప్లాన్ చేశామని తెలిపారు ఇందులో తన పాత్ర నిడివి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు.. ఫహద్ ఫాజిల్. ఇక రీసెంట్ గా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మూడో భాగం కూడా సిద్ధంగా ఉండు అని సుకుమార్ తనతో చెప్పారని తెలిపారు. ఇక మూడో భాగం కోసం కావాల్సిన స్టోరీ కూడా తన దగ్గర ఉందని చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: