బాబోయ్.. ఒక్కో ఎపిసోడ్ కు.. 5 కోట్ల పారితోషకం?

praveen
ఇటీవలి కాలం లో సెలబ్రిటీలు రెమ్యునరేషన్ విషయం లో తగ్గేదేలే అంటూ నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు అనే విషయం తెలిసిందే. అంతే కాదు ఇక సినీ సెలబ్రిటీలు తీసుకుంటున్నా రెమ్యునరేషన్  గురించి తెలిసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్న పరిస్థితి ఏర్పడింది. కేవలం ఫామ్ లో ఉన్న యువ హీరోలు హీరోయిన్లు మాత్రమే కాదు సీనియర్ లుగా ముద్ర పడిన హీరో హీరోయిన్లు సైతం పారితోషికం విషయంలో ఎక్కడ వెనకడుగు వేయడం లేదు.


 ఈ క్రమం లోనే సినీ సెలబ్రిటీల షాకింగ్ రెమ్యూన రేషన్  ప్రేక్షకులందరికీ కళ్లు చెదిరేలా చేస్తూ ఉంది. ఇక ఇప్పుడు ఒక సీనియర్ హీరోయిన్ల పారి తోషికం గురించి  వార్త కూడా సోషల్ మీడియా లో తెగ హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి . ఒకప్పుడు బాలీవుడ్ లో దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.  తన అందం అభినయం తో కట్టి పడేసింది కాజోల్. ఇక ఆ తర్వాత పెళ్లితో సెటిల్ అయింది. అయితే ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. కానీ హీరోయిన్గా అవకాశాలు తక్కువగా వచ్చాయి. ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.


 అయితే కాజోల్ ప్రస్తుతం 47 ఏళ్ళ వయస్సులో కూడా యువ హీరోయిన్లతో  రెమ్యునరేషన్ విషయం లో పోటీ పడుతుంది అన్నది తెలుస్తుంది.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మిస్తున్న ఒక థ్రిల్లర్ షో లో నటిస్తుంది కాజోల్. ఇందు కోసం ఆమె ఒక్కో ఎపిసోడ్కి ఏకంగా 5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ షోకి సుప్రీత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అదే సమయం లో నటి రేవతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలాం వెంకీ అనే సినిమాలో కూడా నటిస్తుంది కాజోల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: