నాని దసరా చిత్రం థియేటర్ రైట్స్ భారీ ఆఫర్..!!

Divya
కరోనా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికీ ఎన్నో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం మునుపటి కంటే ఎక్కువ భారీ స్థాయిలో పెరిగిపోతూ వస్తోంది. ప్రస్తుతం ఓటీటి బిజినెస్ కూడా బాగానే జరుగుతూ వస్తోంది. గతం లో పోలిస్తే సినిమా మేకర్లకు ఆదాయ వనరులు మాత్రం బాగానే పెరిగాయి. ఇటు ఓటిటి, శాటిలైట్ రైట్స్, హిందీ రైట్స్ ద్వారా బాగానే ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్లను నిర్మిస్తూ బాగానే సంపాదిస్తున్నారు.


అయితే ఇంతగా మారినప్పటికీ ఒక విషయంలో మాత్రం టాలీవుడ్ ని చాలా భయపెడుతూనే ఉన్నది. అదే థియేట్రికల్ రన్ అండ్ బిజినెస్. అత్యధిక భారీ బడ్జెట్ చిత్రాలకే తప్ప సాదా సినిమా చిత్రాలకు ప్రేక్షకులు ఆదరణ కరువుతోందని చెప్పవచ్చు. పెద్దగా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి మక్కువ చూపలేదు. దీంతో థియేట్రికల్ ఆదాయం కూడా తగ్గుతూ వస్తోంది కానీ నాన్ థియేట్రికల్ ఆదాయం మాత్రం పెరుగుతూనే ఉన్నది. కానీ ఇది రానున్న రోజుల్లో థియేటర్ల వ్యవస్థని పతనం చేయడానికి ముఖ్య కారణం అవుతుంది అని ఇండస్ట్రీలో టాక్ గా వినిపిస్తోంది.

ఇక ఇదంతా ఇలా ఉండగా హీరో నాని నటించిన దసరా చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ కి భారీగానే ఆఫర్ లభించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా హిందీ డిజిటల్ శాటిలైట్ రైట్స్ అన్ని కలుపుకొని దాదాపుగా 47 కోట్ల రూపాయలు మొత్తంలో భారీ ఆఫర్లు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకొరకు ఒక సంస్థతో ఒప్పందం కుదిరించుకున్నట్లుగా సమాచారం. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తూ ఉన్నది. ఈ సినిమా రూ.50 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే కనుక నిజమైతే సినిమా ప్రొడ్యూసర్ భయపడాల్సిన పనిలేదని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: