ది ఘోస్ట్ సినిమా నుంచి గ్లింప్స్ వైరల్..!!

Divya

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ గా తెరకెక్కించడం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్లు పోస్టర్లకు పలు విశేషణ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. ఇక దీంతో ఈ సినిమా ప్రమోషన్లను కూడా ప్రారంభించారు చిత్ర బృందం.


ది ఘోస్ట్ సినిమాలో నాగార్జున ఒక ఇంటిలిజెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా గ్లింప్స్  విషయానికి వస్తే నాగార్జున రెండు చేతులతో రెండు పెద్ద కత్తులను పట్టుకొని శత్రువులను ఊచకోత కోయడం మనం చూడవచ్చు. ఫార్మల్ షూట్ లో నాగార్జున ఎంత క్రూరంగా కనిపిస్తున్నారు.ఘోస్ట్ కిల్లింగ్ మెషిన్ వీడియో నాగార్జున కోపాన్ని చూపించడం జరుగుతోంది. ఘోస్ట్ తో ఎప్పుడూ కూడా గొడవ పడకండి అని ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది దీనికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు విజువల్స్ పరంగా కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా కనిపిస్తోంది.


ఇదిలా ఉండగా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల అవడానికి సిద్ధమైనట్లుగా గ్లింప్స్  ద్వారా చిత్ర బృందం ప్రకటించారు. నాగార్జునకల్ క్లాసిక్ ఇండస్ట్రీ బ్రేక్ ఆయన చిత్రం శివ కూడా 1989 అక్టోబర్ 5వ తేదీన విడుదలైంది. ఇప్పుడు అదే తేదీన ది ఘోస్ట్ చిత్రం కూడా విడుదల అవ్వడంతో నాగార్జున అభిమానుల సైతం ఒకసారిగా కుషి అవుతున్నారు. ప్రవీణ్ సత్తూరు ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కించడం జరిగింది. నాగార్జున సరసన సోనాల్ చౌహన్ హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ చిత్రంతో విజయాన్ని అందుకుంటారేమో చూడాలి నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: