రానా పాడిన విప్లవ గీతం వీడియో వైరల్..!!

Divya
డైరెక్టర్ వేణు దర్శకత్వంలో హీరో రానా, సాయి పల్లవి, ప్రియమణి కలిసి నటించిన చిత్రం విరాట పర్వం. ఈ సినిమాపై న భారీగానే అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రతి ఒక్కరి నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు 1990లో జరిగిన ఒక యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న చలో చలో అనే విప్లవ గీతాన్ని కూడా విడుదల చేయడం జరిగింది చిత్రబృందం. ఈ పాటని హీరో రానా ఎంతో అద్భుతంగా పాడడం జరిగింది ఈ పాట కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.


మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే అంటూ వచ్చే విప్లవ గీతం పాటని హీరో రానా పాడడం జరిగింది. ఆడబిడ్డ రక్షణ పై పోరాటం ,దళితుడి ఆత్మగౌరవాన్ని పై పోరాటం.. పేదోడు అన్నానీకై పోరాటం ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు వచ్చే చరణాలు అంటూ ఈ పాట ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. ఈ పాటని జిలకర శ్రీనివాస్ రాయగా.. సురేష్ బొబ్బిలి రానా కలిసి ఈ పాట ని పడడం జరిగింది. నక్సలైట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో నక్సలైట్ రవన్న గా హీరో రానా కనిపించబోతున్నారు. ఇందులో సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించబోతోంది. ఈ సినిమాలోని కీలకమైన పాత్రలో నవీన్చంద్ర కూడా నటించడం గమనార్హం.


భారీ అంచనాల మధ్యన విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో  తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఇందులో రానా స్కోప్ తక్కువగా ఉన్నా కూడా ఈ సినిమాని కేవలం సాయిపల్లవి కోసమే తెరకెక్కించానని చెప్పడం గమనార్హం. ఇక అంతే కాకుండా ఈ సినిమాకి ఎక్కువగా సాయి పల్లవి పేరు వినిపిస్తూనే ఉన్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: