సినీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా పోగొట్టుకున్నాను అంటున్న నిర్మాత..!!

Divya
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా పేరు పొందారు ఎమ్మెస్ రాజు. ఆయన బ్యానర్లో సినిమా చేయాలని ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు చాలా ఉత్సాహంగా ఉండేవారు.. అలా వర్షం ,శత్రువు నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు ఈయన బ్యానర్లోనే విడుదలయ్యాయి. ఆ తరువాత కొన్ని పరాజయాలను కూడా చవి చూశారు. ఇకపై తాను రెండు తగ్గట్టుగానే వెళ్తానని తెలియజేశారు ఈయన. ఆ తర్వాత దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి తిరిగారు. ఆయన దర్శకత్వంలో రూపొందించిన 7డేస్ 6 నైట్స్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు విషయాలు తెలియజేశారు.


ఇదివరకు నిర్మాతగా నేను ఎన్నో హిట్ సినిమాలు చేశాను. కొత్తగా ఏం చేయాలో అని ఆలోచిస్తూ ట్రెండ్ కి తగ్గట్టు గానే ఉండే కథలను పెంచుకుంటూ ఏడాదికి రెండుమూడు సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్నాను అని తెలిపారు. ఆ దిశగానే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని తెలిపారు. ఇక తన కుమారుడిని కూడా హీరోగా తన డైరెక్షన్ లోని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కరెక్ట్ అనుకున్నాను కానీ ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని ఇప్పుడు తెలుస్తోందని తెలిపారు. మా అబ్బాయి కెరీర్ విషయంలో కొన్ని కథల ఎంపిక విషయంలో తగు నిర్ణయాలు సరైన ఫలితాలను ఇవ్వలేదని తెలిపారు.

కానీ తన వల్లే తన అబ్బాయి కెరియర్ దెబ్బతిందనే విషయం చెప్పడం కరెక్ట్ కాదని తెలియజేశారు. ఇప్పుడు తన కుమారుడు ఏం చేయాలి.. ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై క్లారిటీ గా ఉన్నామని..తన బ్యానర్లో మహేష్,  ప్రభాస్ తిరుగులేని ఫీట్స్ ని అందుకున్నారని అలాంటి ఒక హిట్ తమ అబ్బాయికి కూడా ఇస్తానని నమ్మకం తనకు ఉన్నట్లుగా తెలియజేశారు. అలాగని ప్రతి ప్రాజెక్టులో కూడా తన అబ్బాయిని పెట్టే ప్రయత్నం ఎన్నడూ చేయలేదని తెలియజేశారు ఎమ్మెస్ రాజు. సినీ ఇండస్ట్రీలో తను పోగొట్టుకున్నది చాలా ఎక్కువగానే ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: