నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం విడుదలైన అఖండ మూవీ తో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని బిస్ ఆఫీస్ దగ్గర అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇలా అఖండ మూవీ తో మసివ్ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ దర్శకుడు అయిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా బాలకృష్ణ కు కెరియర్ పరంగా 107 వ సినిమా కావడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'ఎన్ బి కే 107' అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ప్రస్తుతం 'ఎన్ బి కే 107' చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. అలాగే దునియా విజయ్ ఈ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి బాలకృష్ణ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా 'ఎన్ బి కే 107' మూవీ నుండి చిత్ర బృందం అదిరిపోయే అప్ డేట్ ను ప్రకటించింది. 'ఎన్ బి కే 107' సినిమా టీజర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. ఇలా 'ఎన్ బి కే 107' సినిమాకు సంబంధించిన టీజర్ అప్డేట్ ను చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.