ట్రైలర్: అదుర్స్ అంటున్న విరాట పర్వం ట్రైలర్..!!
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ చాలా వైరల్ గా మారుతూ వచ్చాయి. ఇక తాజాగా ఈ రోజున సినిమా ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం. ఇది ట్రైలర్ విడుదల కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెంచేశాయనే చెప్పవచ్చు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. సాయి పల్లవి మరొకసారి తన నటనతో మెస్మరైజ్ చేసింది అని చెప్పవచ్చు. ఇక రానా కూడా మరొకసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది.
ఈ సినిమాలో హీరో రానా నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారు.. ఇక అతడి భావజాలను ఇష్టపడే ప్రేమించే యువతిగా సాయి పల్లవి చిత్రంలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రానా కామ్రేడ్ రవన్న గా కనిపించనున్నారు. సాయి పల్లవి తో పాటు కొందరు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక 1990 సంవత్సరం నాటి నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ నే విరాట పర్వం చిత్రంగా తెరకెక్కించారు. ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.