హీరోయిన్ రాశి ఖన్నా ను గట్టెక్కించే హీరో ఎవరో..?
ఇందులో వెంకీ మామ చిత్రం పర్వాలేదనిపించిన్నప్పటికీ మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయాయి. ఇక దీంతో రాశీ ఖన్నా మంచి విజయం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నది ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మ రెండు చిత్రాలలో నటిస్తోంది.అందులో ఒకటి పక్కా కమర్షియల్ సినిమా. ఇందులో హీరో గోపీచంద్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమాలో గోపీచంద్, రాశి ఖన్నా లాయర్ గా కనిపించబోతున్నారు.
ఈ సినిమా జూలై ఒకటవ తేదీన విడుదల కానుంది ఇస్తున్న మరొక చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఆ చిత్రమే థాంక్యూ. ఇందులో నాగచైతన్య హీరోగా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చడం జరిగింది. ఇందులో రాసి ఖన్నా తో పాటుగా మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ చిత్రం జూలై 8న విడుదల కానుంది. ఈ ముద్దుగుమ్మ ఈ రెండు సినిమాల పై భారీగానే నమ్మకం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అరె గోపీచంద్ నాగచైతన్య లో ఎవరు ఈమెకు హిట్ ఇచ్చి ఆదుకుంటారెమో చూడాలి. ఒకవేళ రెండు సినిమాలు విజయం అందుకుంటే ఈమె కెరియర్ మారిపోయినట్లే అని చెప్పవచ్చు.