పిశాచి -2 టీజర్ తో అదరగొడుతున్న ఆండ్రియా..!!
ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళంలో పాటుగా తెలుగు కన్నడం, మలయాళం వంటి భాషల్లో కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు చిత్రబృందం. తెలుగులో మాత్రం ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్ బ్యానర్ పై దిల్ రాజు విడుదల చేయబోతున్నారు. పిశాచి గా ఆండ్రియా నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది.. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక టీజర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో పిశాచిగా ఆండ్రియా కనిపిస్తున్న సన్నివేశాలు టీజర్ కే హైలెట్ గా నిలుస్తాయి.
రెడ్ కలర్ టీమ్లో అంత చీకట్లో రూపొందించిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను భయపెట్టె లా కనిపిస్తున్నాయి. అయితే ముందుగా టీజర్ని పిల్లలు చూడకూడదని ముందే తెలియచేశాడు డైరెక్టర్ మిస్కిన్. ఇక ఈ చిత్రాన్ని పెద్దలకె వణుకు పుట్టించే విధంగా తెరకెక్కించాడు డైరెక్టర్. దుండిగల్ లోని ఫారెస్ట్ లో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగిందట. ఒక ఏడాదికి పైగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.