రాజమౌళి కార్ల పై ఆశక్తికర కథనాలు !

Seetha Sailaja

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ లేనప్పటికీ ఆమూవీ ఇప్పటివరకు 11వందల కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టింది అని వస్తున్న వార్తలు రాజమౌళి స్టామినాను చూపెడుతున్నాయి. సినిమాకు 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే రాజమౌళి తీసే సినిమాలు అత్యంత భారీగా ఉంటాయి కాని ఆయన వ్యక్తిగత జీవితం సాదాసీదాగా ఉంటుంది.

రాజమౌళి కానీ ఆయన భార్య రమారాజమౌళి కానీ ఎలాంటి ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా ఉంటారు. తాను తీసే సినిమాల గ్రాఫిక్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టే రాజమౌళి తాను ప్రయాణించే కార్ల విషయంలో మాత్రం చాల పొదపరితనాన్ని ప్రయోగిస్తూ ఉంటాడు. జక్కన్న కారుకు వ్యక్తిగత డ్రైవర్ ఉండడు ఆయన తన కారుకు తానే డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటాడు.

అంతేకాదు రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి విలాసవంతమైన హోటల్స్ వెళ్ళడం కానీ అత్యంత ఖరీదైన ఫారెన్ ట్రిప్స్ కు వీలడం కానీ చేయడు. తన ఇంటిలోనే ఉంటూ ఖాళీ సమయాల్లో తన సినిమాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ ఘనవిజయం తరువాత రాజమౌళి సుమారు 45 లక్షలు విలువ చేసే వోల్వో ఎక్సీ మోడల్ కారును కొనుకున్నాడు. ఈకంపెనీ ప్రతినిధులు తమ మోడల్ కారును రాజమౌళి లాంటి గొప్ప వ్యక్తులు కూడ కొన్నారు అంటూ మీడియాలో పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు.

అయితే రాజమౌళి లాంటి నేషనల్ సెలెబ్రెటీ రోల్స్ రాయస్ లాంటి 4కోట్లకు పైగా విలువచేసే కార్లు కొనాలి కానీ ఇంత తక్కువ ధరలలో ఉండే మీడియం రేంజ్ లో ఉండే కార్లను కొనడం ఏమిటి అంటూ చాలామంది షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మీడియం రేంజ్ దర్శకులు కూడ కనీసం కోటి రూపాయల కార్లలో తిరుగుతుంటే జక్కన్న మాత్రం ఇంత పొదుపుగా ఉంటాడా అంటూ చాలామంది షాక్ అవుతున్నారు. దీనితో రాజమౌళికి చిన్నకార్లకు మధ్య ఏదైనా సెంటిమెంట్ ఉందా అంటూ అనేక చర్చలు జరుగుతున్నాయి..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: