F-3 సినిమా నుంచి బిగ్ అప్డేట్.. వీడియో సాంగ్ వైరల్..!!
దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇక మొదటి పార్ట్ కంటే.. రెండవ పార్ట్ లోనే మరింత ఎక్కువ కామెడీ ఉండబోతోంది అన్నట్లుగా చిత్రబృందం తెలియజేస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఒక వీడియో గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఊ.. ఆ.. ఆహా.. ఆహా.. అనే సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పాటను ఈనెల 22వ తేదీన పూర్తిగా విడుదల చేయనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి లిరికల్ ప్రోమో ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం.
ఇక ఈ వీడియో విషయానికి వస్తే.. ఇందులో వెంకటేష్ తమన్నా, వరుణ్ తేజ్, మెహరీన్, సునీల పైన ఈ పాటను చిత్రీకరించినట్లు గా కనిపిస్తోంది. ఇక ఈ పాటని దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటలో ఇద్దరు హీరోయిన్లు ఎంతో అద్భుతంగా డాన్స్ వేసినట్లుగా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో సాగే ఈ సినిమాలో ఈ పాట మరింత స్పెషల్ గా కనిపించేలా కనిపిస్తోంది. మొత్తానికి తమన్నా, మెహరీన్ ఇద్దరు కలిసి మరొకసారి రచ్చ చేశారని చెప్పవచ్చు.