నెటిజన్ కు షాక్ ఇచ్చేలా ట్వీట్ చేసిన సోనుసూద్.. కారణం ఏమిటంటే..?

Divya
సోను సూద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించాడు ఈ టాలెంటెడ్ నటుడు. కరోనా సమయంలో రియల్ హీరోగా పేరుపొందాడు సోనుసూద్. వలస కార్మికులకు నిరుపేద కార్మికులకు అండగా నిలబడ్డాడు. దీంతో ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించిందని చెప్పవచ్చు. అయితే ఇలా పేరుపొందిన సోనూసూద్ కు నెటిజన్లు అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడిగి తనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే ఇటీవల ఒక అభిమాని చల్లని బీరు కావాలని సోనుసూద్ పేరును ట్యాగ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే సోనుసూద్ ఇలాంటి పోస్టులు పెట్టిన ప్రశ్నలు వేసినా కూడా వాటిని ఎంతో సానుకూలంగానే వారికి సమాధానాలు ఇస్తూ ఉన్నారు.

అలా సమాధానాలు తెలుపుతూనే ఎంతో మంది అభిమానుల మనసు కూడా గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఒక నెటిజన్స్ అడిగిన ప్రశ్నకు తిరిగి సమాధానం ఇవ్వడం జరిగింది సోనుసుధ్ వాటి గురించి చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే.. ఒక నెటిజన్ ఏ విధంగా అడిగారు అంటే.. సోదరా మీరు అడిగిన వారందరికీ సహాయాలు చేస్తారు కదా.. నాకు కూడా సహాయం చేయండి.. తన భార్య ప్రతిరోజు తన రక్తం తాగుతోందని.. దీనికి ఏమైనా చికిత్స ఉందా అంటూ సోనూసూద్ ను ప్రశ్న వేశారట.

అందుకు సోను సూద్ రిప్లై ఇస్తూ అది ప్రతి భార్యకు జన్మహక్కు సోదరా.. మీరు కూడా నాలాగే మీకు వచ్చిన రక్తంతో ఒక బ్లడ్ బ్యాంక్ మొదలు పెట్టండి.. అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు సోనుసూద్. ఈ ఆన్సర్ కు ఒక ఫన్నీ ఇమేజెస్ ను షేర్ చేస్తూ తెలియజేశారు సోను సూద్. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారడంతో నెటిజన్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు సోను సూద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: