తన లవ్ ఎఫైర్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన నిధి అగర్వాల్..!!
అటు తెలుగులోనూ, కోలీవుడ్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు హీరో శింబు. ఇక ఈ హీరో గతంలో హన్సిక, నయనతార వంటి హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడపడం జరిగింది. కాని అది విఫలం అయింది. అయితే ఆ తర్వాత ఇప్పుడు తాజాగా శింబుతో నిధి అగర్వాల్ ప్రేమలో పడింది అనే వార్త కోలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యింది. త్వరలో వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా బాగా చక్కర్లు కొట్టాయి. అయితే శింబు నిధి అగర్వాల్ కలిసి సుచిత్ర డైరెక్షన్లో ఈశ్వరన్ సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అన్నట్లుగా వార్తలు వినిపించాయి.
గత కొంతకాలంగా చెన్నైలో శింబు ఇంట్లోనే ఉన్నది అన్నట్టుగా వార్తలు కూడా వినిపించాయి. అయితే 38 సంవత్సరాల వయ* వచ్చినా కూడా ఇంకా హీరో వివాహం కాలేదు. కానీ సినిమాలతోపాటు గా తరుచు ఎక్కువగా ప్రేమ వ్యవహారాలతో నిరంతరం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు శింబు. అయితే తమిళంలో వీక్లీ వికటన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో శింబు, తనకు మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని స్పష్టం చేసింది.ఇక మొదటిగా సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది నిధి అగర్వాల్. అయితే ప్రస్తుతం పవన్కళ్యాణ్ సరసన పరిహార వీరమల్లు చిత్రంలో కూడా కథానాయికగా నటిస్తున్న ది. ఎట్టకేలకు వీరిద్దరి మధ్య ఏమీ లేదని తెలియజేసింది ముద్దుగుమ్మ నిధి.