షాక్: బండ్ల గణేష్ కోర్టు హాజరు కావడానికి కారణం..?
ఇక అసలు విషయంలోకి వెళితే కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని సార్ హీరోలతో సినిమాలు తీసి.. అప్పు ఇచ్చిన వారందరిని నట్టేట ముంచారని ప్రొద్దుటూరు ఫైనాన్సియల్ ఆరోపిస్తున్నారు. బండ్ల గణేష్ ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించినప్పటికీ.. ఒక అప్పు విషయంలో తాజాగా కోర్టుకు హాజరైన పరిస్థితి ఏర్పడింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైనట్లుగా సమాచారం. గతంలో ప్రొద్దుటూరుకు చెందిన కొంతమంది ఫైనాన్సియల్ దగ్గర 10 కోట్ల రూపాయల వరకు బండ్లగణేష్ అప్పుగా తీసుకున్నారట. అయితే ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో కొంతమంది వ్యాపారులు కోర్టులో చెక్ బౌన్స్ కేసులో వేసినట్లు తెలుస్తోంది.
ప్రొద్దుటూరు ఫైనాన్సియర్ కూడా మార్కెట్లో ఉండే వాటి కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది అనడంతో నిర్మాతలకు పెట్టుబడి పెట్టడానికి కోట్లల్లో అప్పు ఇచ్చినట్లుగా సమాచారం. కేవలం బండ్లగణేష్ కాకుండా హైదరాబాదులో ఉండే కొంతమంది సినీ నిర్మాతలకు కూడా కోట్ల రూపాయలు అప్పు ఇచ్చినట్లు సమాచారం. పొద్దుటూరు లో ఒక సామాజిక వర్గం దగ్గర ఏడు సంవత్సరాల క్రితం సినీ పరిశ్రమకు చెందిన ఒక నిర్మాత కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఆ నిర్మాత ఎగర కొట్టారట. దీంతో కొన్ని కోట్ల రూపాయలు మునిగిపోయాం అని తెలిపారు ఫైనాన్సియర్. అయితే బండ్ల గణేష్ మాత్రం పొద్దుటూరు ప్రాంతానికి చెందిన కొంతమందితో లక్షల్లో డబ్బు అప్పు తీసుకున్నట్లు సమాచారం..అయితే అతను ఇచ్చిన చెక్కు బ్యాంకులో చెల్లెకు పోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం బండ్ల గణేష్ పై 66 కేసులు 8 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్లుగా సమాచారం.