ఆర్ ఆర్ ఆర్ విషయంలో ప్రభాస్ అభిమానుల వితండవాదన !

frame ఆర్ ఆర్ ఆర్ విషయంలో ప్రభాస్ అభిమానుల వితండవాదన !

Seetha Sailaja
‘రాథే శ్యామ్’ ఘోర పరాజయం చెందడంతో దిగులుపడ్డ ప్రభాస్ వీరాభిమానులు ‘ఆర్ ఆర్ ఆర్’ విజయానికి ఒక కొత్త భాష్యం చెపుతున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ మొదటిరోజు కలక్షన్స్ ‘బాహుబలి 2’ ను క్రాస్ చేసినప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ కలక్షన్స్ కొన్ని ఏరియాలలో ‘సాహో’ రికార్డులను బ్రేక్ చేయలేకపోవడంతో ప్రభాస్ అభిమానులు కొంతవరకు ఆనంద పడుతున్నారు.

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి మొదటిరోజున బాలీవుడ్ లో 20 కోట్ల కలక్షన్స్ వస్తే రాజమౌళి కాంబినేషన్ లేకుండానే ప్రభాస్ ‘సాహో’ మొదటిరోజున బాలీవుడ్ లో 24 కోట్లు కలెక్ట్ చేసిన విషయాన్ని గుర్తుకు చేస్తూ రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు పేరు ఉన్నప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ కేవలం 20 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని దీనితో సక్సస్ ఫుల్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ కంటే ఫెయిల్యూర్ మూవీ ‘సాహో’ గొప్పది అంటూ బాలీవుడ్ లో ఇప్పటికీ ఎప్పటికీ ప్రభాస్ మాత్రమే సూపర్ హీరో అంటూ ఒక వింత ప్రచారాన్ని సోషల్ మీడియాలో మొదలుపెట్టారు.

అంతేకాదు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి ‘బాహుబలి’ కి వచ్చినంతగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చినంత క్రేజ్ ఏర్పడదని కేవలం ప్రభాస్ రాజమౌళికి మాత్రమే అలాంటి ప్రత్యేకమైన మరో సరికొత్త పాయింట్ తో చర్చలకు తెర లేపారు. తెలుగు సినిమా చరిత్రలో ‘బాహుబలి’ ఏర్పరుచుకున్న ప్రత్యేక స్థానాన్ని ‘ఆర్ ఆర్ ఆర్’ స్థానం పొందలేదని అంటూ రాజమౌళి ప్రభాస్ ల కాంబినేషన్ లో ‘బాహుబలి 3’ మాత్రమే తెలుగు సినిమా చరిత్రను తిరగ వ్రాస్తుంది అంటూ ప్రభాస్ వీరాభిమానులు ఈ సరికొత్త వాదానికి శ్రీకారం చుడుతున్నారు.    
అయితే ఈ కామెంట్స్ అన్నీ ప్రభాస్ వీరాభిమానుల అత్యుత్సాహంతో చేసినట్లుగా అనిపిస్తోంది కానీ రాజమౌళి తలుచుకుంటే ‘ఆర్ ఆర్ ఆర్’ కన్నా మరింత భారీ సినిమాలు తీసి సగటు ప్రేక్షకుడుని మెప్పించాగలదు అంటూ విశ్లేషకుల అభిప్రాయం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: