
స్టేజ్ మీద ఎమోషనల్ అయిన సమంత.. ఏం జరిగిందంటే..?
అభిమానులు తనపై చూపిస్తున్న ఈ ప్రేమకు ధన్యవాదాలు అంటూ వారి పైన ప్రేమ తాను ఈ స్థాయిలో ఉన్నదంటూ చాలా బాగా ద్వేగానికి గురైనట్టుగా తెలియజేసింది. చెన్నై వేదికలో ఇటీవలే జరిగినటువంటి బిహైండ్ వుడ్స్ అవార్డుల వేడుకలలో భాగంగా సమంత ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2010 నుంచి స్ఫూర్తిదాయక పాత్రలలో అలరిస్తున్న సమంతకు కే.బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు తనకి చాలా ఆనందాన్ని కలిగించింది అంటూ తెలియజేసింది సమంత.
కే బాలచందర్ సార్ చాలా అద్భుతమైన పాత్రలలో నటించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో స్త్రీపాతలు చాలా సహజంగానే కనిపిస్తూ ఉంటాయి. ఆయన సినిమాల నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని ఈరోజు నా జీవితం పరిపూర్ణమైనట్లుగా అనిపిస్తున్నది అంటూ సమంత ఈ అవార్డు అందుకొని ఈ వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా సినిమాలు హిట్ అయితే ప్రేమించేవారు ఉంటారు.. కానీ ఒక తమిళ సినిమా కూడా ఇప్పటివరకు రెండేళ్లు అవుతున్న చేయలేదు..ఈ మధ్యకాలంలో సరైన హిట్టు కూడా పడలేదు. అయినా కూడా నా పైన మీ ప్రేమ మాత్రం తగ్గలేదు ఈ విషయం పైన తను ఏమి మాట్లాడలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ గా తెలియజేసింది సమంత. తాను ఇప్పుడే యాక్షన్ సీక్వెన్స్ చేసి వచ్చాను కాబట్టి డాన్స్ చేయలేనని తెలియజేసింది సమంత.