ఇండస్ట్రీలో విషాదం.. నటి తండ్రి దారుణ హత్య..?
అలా శనివారం రాత్రి ఇంట్లో ఉండే పని మనుషులను తాళ్లతో కట్టేసి సూర్యనారాయణను కుర్చీకి బంధించారు. అనంతరం ఆయన నోరు ముఖం పైన టేపు చుట్టేయడంతో ఊపిరాడక ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. ఈ హత్య అనంతరం నిందితులు సూర్యనారాయణన్ ఇంట్లో ఉండే బంగారు నగదుతో పారిపోయినట్లుగా తెలియజేశారు. అలాగే ఆ దొంగల ముఠా దొరకకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ ను కూడా తీసుకొని పారిపోయారు.
అయితే ఈ కేసుని పోలీసులు సైతం మరొక కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నటి విష్ణు ప్రియ ప్రియుడు ప్రభాకరన్ 2018లో హత్యకు గురైన సంఘటనలో సూర్యనారాయణ నిందితుడిగా ఉన్నారు. అయితే ఇప్పుడు జరిగిన ఈ హత్య ఆనాటి పాత కక్షలు వల్ల జరిగిందా? లేకపోతే నిజంగానే దోపిడీ కోసం చేశారా అనే కోణంలో ఆ జిల్లా ఎస్పీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రతి విష్ణు ప్రియ విషయానికి వస్తే హీరో సూర్య, జ్యోతిక జంటగా నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం మాయావీలో విష్ణుప్రియ ఒక కీలకమైన పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. తన తండ్రి ఇలాంటి దారుణ హత్యకు గురవడంతో ఆమె కుటుంబం కూడా తీవ్రదిగ్బ్రాంతికి గురవుతోంది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.