వైసీపీలో చేరడంపై వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ క్లారిటీ..!

Divya
తెలుగు రాష్ట్రాలలో వంగవీటి కుటుంబం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. వంగవీటి మోహనరంగా కుటుంబం నుంచి ఆయన కుమారుడు రాధాకృష్ణ రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఇటీవలే రంగా కుమార్తె ఆశాకిరణ్ కూడా ఈమధ్య రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వాలని యాక్టివ్ గా కనిపిస్తున్నారు. గత కొంతకాలంగా ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆశాకిరణ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని ఏ పార్టీలో చేరుతారనే విషయం పైన మాత్రమే ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ పార్టీలో చేరబోతోందనే విధంగా ప్రచారం అయితే జరుగుతోంది.


కానీ తాజాగా ఈ విషయం పైన మాట్లాడుతూ.. తాను వైసీపీ పార్టీలో  చేరబోతుందనే విషయం పైన క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా వస్తున్న ప్రచారంలో నిజం లేదని తెలియజేసింది. ఇటీవల ఆమె ఒక చారిత్రాత్మకమైన కంభం చెరువును సందర్శించారు . అక్కడ ఈ విషయాన్ని తెలియజేశారు. కావాలనే కొంతమంది పనిగట్టుకుని వైసీపీ పార్టీలో చేరబోతున్నామనే ప్రచారాన్ని చేస్తున్నారని తాను రాష్ట్రవ్యాప్తంగా రాధా, రంగ మిత్రమండలిని ఏకతాటి పైకి తీసుకువచ్చేలా మాత్రమే కృషి చేస్తున్నానని తాను రాజకీయాలలోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉందని తెలిపింది.


తాను ఏ నిర్ణయం తీసుకున్న అభిమానుల అభిప్రాయం మేరకే ఉంటుందంటూ ఆశాకిరణ్ వెల్లడించారు. తన తండ్రి రంగా కేవలం పేద ప్రజల కోసము మాత్రమే జీవించారని ,వారి కోసమే ప్రాణ త్యాగం  చేశారని ఎన్నో సందర్భాలలో తెలియజేసింది. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకే తన ప్రజలలోకి వస్తున్నానని వెల్లడించారు. ఏపీ అంతట పర్యటిస్తూ బీసీల విద్యార్థులను కలిసి రాధా రంగ మిత్రమండలిని మరింత బలోవేతం చేస్తానంటూ తెలిపారు. తన గురించి ఏదైనా పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరిగితే ఎవరు నమ్మొద్దని, ఎలాంటి  విషయాన్నైనా సరే తాను స్వయంగా ప్రకటిస్తానంటూ తెలియజేసింది ఆశాకిరణ్. ప్రస్తుతం ఇమే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: