"కెజిఎఫ్ 2" రిలీజ్ అయితే "ఆర్ ఆర్ ఆర్" పరిస్థితి ఏంటి?
అయితే రాజమౌళి సినిమాను వేలెత్తి చూపించేంత దైర్యం ఎవరికీ లేదా? అంటూ కొన్ని ఏరియాలలో వినబడుతోంది. కానీ ఆర్ ఆర్ ఆర్ లాంటి ఒక సినిమాను తెరకెక్కించిన విధానానికి అందరూ ఫుల్ హ్యాపీ అని చెప్పాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో తెలుగు సినిమా పోటీలో లేదు కాబట్టి ఓకే కలెక్షన్ లకు ఎటువంటి ఢోకా ఉండదు. కానీ ఏప్రిల్ రెండవ వారంలో రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉన్న పవర్ ఫుల్ మూవీ కెజిఎఫ్ 2 కనుక క్లిక్ అయితే, ఆర్ ఆర్ ఆర్ వసూళ్లు కొద్దీ రోజులకే పరిమితం అవడం ఖాయం. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కెజిఎఫ్ ఏ స్థాయిలో రికార్డు సృష్టించిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమా ముఖ్యంగా అటు మాస్ ప్రేక్షకులను మరియు యూత్ ను బాగా ఆకట్టుకోవడంతో వసూళ్లు అద్భుతంగా వచ్చాయి. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో వదిలేసిన ట్విస్ట్ కోసం హీరో యాష్ ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్, టీజర్, ఫస్ట్ సాంగ్ తూఫాన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ ఆదివారం సినిమా నుండి ట్రైలర్ విడుదల కానుంది. మరి ఆర్ ఆర్ ఆర్ ను కెజిఎఫ్ 2 దెబ్బ తీస్తోందా? లేదా ఆర్ ఆర్ ఆర్ వసూళ్లకు కెజిఎఫ్ 2 తోక ముడుస్తుందా అన్నది తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.