ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Divya
బుల్లితెరపై క్వీన్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ సుమ. ఈమె వేసే పంచులు ఇన్స్టెంట్ గా పేలుతూ బాగా పేరు తెచ్చిపెట్టాయి. సినిమా వేడుక ఏదైనా సరే ఖచ్చితంగా ఆమె వాయిస్ వినిపించాల్సిందే.. ఇక గతంలో ఏ ఛానల్ మారినా ఆమె ఖచ్చితంగా కనిపించాల్సిసిందే అన్నట్లుగా ఉండేది. కానీ రాను రాను ఎంతోమంది యాంకర్లు సైతం పుట్టుకు రావడం జరిగింది. వారికి పోటీ ఇస్తూనే తనదైన శైలిలో తన మార్కును చాటుకుంటోంది. అయితే తన చిన్నప్పుడు ఉన్న ఒక ఫోటో ఇప్పుడు నెట్లో తెగ వైరల్ గా మారుతుంది.

ప్రస్తుతం సుమా ఇటు బుల్లి తెర ను, అటు వెండితెరను ఈక్వల్ గా మెయింటెన్ చేస్తూ తన కెరియర్ ను  కొనసాగిస్తోంది. ప్రస్తుతం టాప్ యాంకర్లలో మొదటిస్థానంలో ఈమె ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చిత్ర సీమలో ఎటువంటి సక్సెస్ మీటింగ్ జరిగిన కూడా ఖచ్చితంగా ఈమె ఉండాల్సిందే. తాజాగా సుమ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను మరింత అలరిస్తోంది. మలయాళ అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగులో సుదీర్ఘంగా మాట్లాడగలదు సుమ. ఇక తన భర్త రాజీవ్ కనకాల ను ఈమె ప్రేమించి వివాహం చేసుకున్నది.
సుమ మాటలు ఎప్పుడూ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండవు.. కేవలం నవ్వించేలా మాత్రమే ఉంటాయి. అందుచేతనే ఎన్నో సంవత్సరాల నుండి తిరుగులేని హవా ప్రదర్శిస్తోంది ఈమె.. ఇక అంతే కాకుండా తాజాగా జయమ్మ పంచాయితీ అనే మూవీ ద్వారా వెండితెరపైకి త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అంతేకాదు ఇక తాజాగా సుమ బర్త్ డే సందర్భంగా ఆమె చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు సైతం సుమ ఎంత క్యూట్ గా, అందంగా ఉందని కామెంట్లు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: