ప్రధాని మోదీ కి ఆ జబ్బు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్..!!

Divya
విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు జరగక ముందు వరకు కూడా కేవలం ఒక గొప్ప నటుడిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎప్పుడైతే మా ఎన్నికలలో పోటీపడి అధ్యక్షపదవి కోసం బరిలోకి దిగారో ఆ రోజు నుంచి ఈయన రకరకాల వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రకాష్ రాజ్ రాజకీయ నాయకుల పై ఏకంగా స్పందిస్తూ ఏపీలో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఆయన స్పందిస్తూ ఉన్న విషయం తెలిసిందే. అయితే నేడు తాజాగా ప్రధాని మోదీ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు.


ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజు సోషల్ మీడియా వేదికగా వెటకారంగా వ్యాఖ్యలు చేసి అందరికీ షాకిచ్చాడు. ఇకపోతే ఒక సమావేశంలో చంద్రకాంత్ పాటిల్.. ప్రధాని మోదీ రెండు గంటలు మాత్రమే  నిద్ర పోతారని.. ఇక రోజులో 22 గంటల పాటు ఆయన పని చేస్తూనే ఉంటారు అని తెలపడంతో ఆ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.. ఈ మేరకు ట్వీట్ చేస్తూ దయచేసి మీరు కూడా కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి.. ఎవరైనా సరే రోజుకు ఇరవై రెండు గంటలు పనిచేస్తున్నారు అంటే వారికి ఏదైనా జబ్బు ఉంది అని గమనించాలి.. నిద్రపో లేకపోవడం అనేది అతి పెద్ద జబ్బు..

వైద్య పరిభాషలో దీనిని ఇన్సోమ్నియా అని పిలుస్తారు. ఈ జబ్బు గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు వెంటనే ఆ జబ్బుతో బాధ పడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి అంటూ ట్వీట్ చేయడం జరిగింది. దీంతో ఈ ట్వీట్ కాస్త బాగా వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరూ ప్రకాష్ రాజ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.. అవకాశం వస్తే చాలు  ప్రకాష్ రాజ్ బీజేపీ నాయకులపై అలాగే ప్రధాని మోడీ పై విమర్శలు గుప్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: