రాధేశ్యామ్ ట్విట్టర్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ హిట్టేనట?
ఇక మిగతా ప్రేక్షకులు చెబుతున్న మాట ఏంటంటే.. చెబుతున్న వినండి గురు ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు అని కాదు.. ప్రభాస్ రాధేశ్యామ్ బ్లాక్ బస్టర్ హిట్ అంతే.. ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు కావలి గురు అంటూ రివ్యూ ఇచ్చేస్తున్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా 7010 తెరలపై ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇక ఎన్నో రోజుల నుంచి ఊహించని రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను అదే రేంజ్ లో థియేటర్లకు రాబట్టింది. ఇక ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ చూసుకుంటే విజువల్స్ అదిరిపోయాయి. ప్రభాస్ యాక్టింగ్ ఎప్పుడూ చూడనంత సరికొత్తగా ఉంది. ఇక తమన్ విజయంతో బిజియం అవుట్స్టాండింగ్ అనిపించుకున్నాడు అంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు.
అంతేకాదు ఇక ఫస్టాఫ్ అదిరిపోయింది అనుకుంటే ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం మాత్రం సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్తుందట. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెకండాఫ్ అయితే ప్రేక్షకుల ఊహకందని రీతిలో ట్విస్టులతో ఉంటుందని అంటున్నారు ట్విట్టర్ లో రివ్యూ ఇస్తున్న ప్రేక్షకులు. ఇక రాధేశ్యామ్ సినిమాతో ప్రభాస్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అని నెటిజన్లు తమదైన శైలిలో రివ్యూలు ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక ట్విట్టర్ లో వస్తున్న రివ్యూలు చూసి ప్రభాస్ అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి పోతున్నారు.