గంగూబాయ్ సినిమాకు ఆలియా కంటే ముద్దు ఎవరిని అనుకున్నారో తెలుసా..?

Pulgam Srinivas
సినిమాలో  ఒక పాత్రను ఒకరితో తెరకెక్కించాలని అని అనుకున్న తర్వాత వారికి ఆ కథ నచ్చకపోవడం వల్లో లేకపోతే ఆ సమయంలో వారి డేట్ లు కుదరకపోవడం వల్లో లేక మరి కొన్ని కారణాల వల్ల కొంతమంది చేయవలసిన సినిమాలలో కొంతమంది నటిస్తూ ఉండటం అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయం,  ఇలాంటి పరిస్థితే గంగూబాయి కతియావాడి సినిమాలో కూడా ఎదురైనట్లు కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా బాట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గంగూబాయి కతియావాడి,  మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది.


  ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబడుతోంది,  ఈ సినిమాలో ఆలియా భట్ నటనకు కూడా ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా విమర్శకుల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.  ఇలా గంగూబాయి కతియావాడి సినిమాతో ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న ఆలియా భట్ పాత్ర కు మొదట వేరే హీరోయిన్ లను అనుకున్నారట,  ఈ సినిమాలో ఆలియా భట్ పాత్ర కోసం మొదట ప్రియాంక చోప్రా చిత్ర బృందం అనుకున్నారట,   కొన్ని కారణాల వల్ల ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో నటించినట్లు వార్తలు వస్తున్నాయి.  అలాగే ఆ తర్వాత సంజయ్ లీలా బన్సాలీ ఈ పాత్ర కోసం దీపికా పడుకొనే సంప్రదించగా కొన్ని కారణాల వల్ల ఈ ముద్దుగుమ్మ కూడా ఈ సినిమాలో నటించలేదట,  ఇలా ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే వదులుకున్న ఈ సినిమా అవకాశం ఆలియా బాట్ కి వచ్చినట్లు తెలుస్తోంది,  ఈ అవకాశాన్ని ఉపయోగించుకోని ఈ సినిమా ద్వారా నటిగా ప్రేక్షకులతో,  విమర్శలతో ఆలియా భట్ మంచి మార్కులు వేయించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: