తన భర్త పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటి..!!
తాజాగా కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ అనే ఒక రియాల్టీ షోలో భాగంగా ఈమె ఈ విషయాలను తెలియజేసింది. ఇక ఈ షో లో గత సంవత్సరం అతను ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులను గూర్చి నిషా రావల్ తెలిపింది. గత సంవత్సరం తను అత్యంత దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.. నిషా రావల్ మాట్లాడుతూ.. పలు సందర్భాలలో తన భర్త కరణ్-పాయల్ రోహత్తి మొబైల్ ఫోన్ లో మాట్లాడుకోవడం చూశానని తెలియజేసింది. ఇక దీంతో వారిద్దరి మధ్య అక్ర* సంబ*ధం ఉందని తనకు అర్థమైందని తెలియజేసింది.
ఇక దాంతో తన భర్త కరణ్ తనని మానసికంగా, శారీరకంగా కూడా హింసించడం మొదలుపెట్టాడట. పాయల్ రోహత్తి తోనే ఉన్న సంబంధాన్ని బయట పెట్టండి అనడంతో నే తన కుమారుడు ని తీసుకొని ముంబైకి వెళ్ళిపోయాడట కరణ్. ఇక ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలియజేసింది నిషా. ఇక పాయల్ తో ప్రేమ వ్యవహారం గురించి అడిగినప్పుడల్లా కరణ్ చాలా వైల్డ్ గా ప్రవర్తించేవాడు అని తెలిపింది. అయితే కరణ్ ను వివాహం చేసుకునేటప్పుడు తన గురించి ఎంతో మంది చెప్పిన ఆయన మీద నమ్మకం తోనే వివాహం చేసుకున్నానని తెలిపింది. కానీ అతడి వల్ల తన జీవితం నాశనం అయిందని తెలిపింది నిషా. ఇక అందుచేతనే ఆయనను ప్రతిసారి నమ్మకూడదని ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని తెలియజేశాను అని చెప్పింది నిషా రావల్.