ప్రభాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

NAGARJUNA NAKKA
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ స్పీడ్‌ పెంచాడు. బాహుబలి తర్వాత కాస్త ఆలస్యం అయినా మళ్లీ రయ్యమని దూసుకెళ్తున్నాడు. పక్కా ప్రణాళికతో పాన్ ఇండియన్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తున్నాడు. ఒక్కో ఏరియాలో ఒక్కో స్టార్‌ని రంగంలోకి దింపి ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచేస్తున్నాడు. సూపర్‌ స్టార్ల సాయంతో ఓపెనింగ్స్‌ పెంచుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

'రాధేశ్యామ్‌' సినిమాని సంక్రాంతికి విడుదల చెేయాలని.. ప్రమోషన్స్‌ని ఒక ఫెస్టివల్ లా చేశాడు ప్రభాస్. పాన్‌ ఇండియన్ ఈవెంట్‌తో ప్రమోషన్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్లాడు. అయితే విడుదల సమయానికి ఒమిక్రాన్‌ కేసులు పెరగడంతో సినిమా పోస్ట్ పోన్‌ అయింది. ప్రభాస్‌ అభిమానులు కూడా కొంచెం డల్ అయిపోయారు. అయితే ఇప్పుడు వాళ్లలో ఎనర్జీ పెంచడానికి, భారీ ఓపెనింగ్స్‌ని టార్గెట్‌ చేస్తూ మార్చి2న 'రాధేశ్యామ్' రిలీజ్‌ ట్రైలర్‌ని దించేశాడు.

రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాధేశ్యామ్'. వింటేజ్‌ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో మార్చి 11న విడుదల అవుతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లోనూ స్పీడ్‌ పెంచుతున్నాడు ప్రభాస్‌. రిలీజ్‌ స్పెషల్‌ ట్రైలర్‌తో పాటు, 'రాధేశ్యామ్‌' కోసం అయిదుగురు స్టార్స్‌ని తీసుకొస్తున్నాడు.

'రాధేశ్యామ్' సినిమాలో కథని నెరేట్‌ చేసేందుకు ఒక్కో భాష నుంచి ఒక్కో స్టార్‌ సాయం తీసుకుంటున్నాడు ప్రభాస్. తెలుగు వెర్షన్‌కి రాజమౌళి వాయిస్ ఓవర్ ఇస్తోంటే, హిందీలో అమితాబ్‌ బచ్చన్ వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నాడు. ఇక కన్నడకి సూపర్‌ స్టార్ శివరాజ్‌ కుమార్‌, మళయాళంకి పృథ్వీరాజ్‌ వాయిస్‌ ఓవర్ ఇస్తున్నాడు. సో అక్కడి ఆడియన్స్‌కి లోకల్ స్టార్ల వాయిస్‌ వినిపిస్తే కలెక్షన్లు కూడా పెరిగే అవకాశముంటుందని చెప్పొచ్చు.


మొత్తానికి రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో ప్రభాస్ చాలా బిజీబిజీగా గడుపుతున్నాడు. ఆ సినిమా విషయంలో ఎప్పుడూ లేనంత కేర్ తీసుకుంటున్నాడు. చూద్దాం... ఆయన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలితాలనిస్తాయో.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: