తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది అవికాగోర్.. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమా తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తన మొదటి సినిమాతో నే హీరో రాజ్ తరుణ్ తో కలిసి ఆ సినిమా సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేసింది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో ఆఫర్లు దక్కించుకున్న అప్పటికీ ఆమెకు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.. హీరోయిన్ గా మొదటి సారి తన కెరీర్ ప్రారంభించినప్పుడు హడావిడి చేసి..ఆ తర్వాత మాత్రం కాస్త డల్ అయి పోయిందని చెప్పవచ్చు.
అందుకు కారణం తను బరువు పెరగడం అన్నట్లుగా అప్పుడు ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. అయితే ఈమె సినీ కెరియర్ గురించి పక్కన పెడితే హీరో రాజ్ తరుణ్ గురించి తన ప్రేమలో ఉన్నట్లు గా వార్తలు వినిపించాయి.. కేవలం వీరిద్దరూ రెండు సినిమాలు మాత్రమే చేశారు.. కానీ అవికాగోర్ మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చిందంటే చాలు హీరో రాజ్ తరుణ్ ను కలుస్తూ ఉండేదట.. అందుచేతనే వీరిద్దరి మధ్య కాస్త ప్రేమ పుట్టుకొచ్చిందని వార్తలు బాగా వినిపించాయి. అయితే గతంలో వీరిద్దరూ ఈ విషయంపై స్పందించి.. ప్రేమ లేదు దోమ లేదు అన్నట్లుగా తెలియజేశారు.
కానీ తాజాగా ఈ విషయంపై అవికా గోర్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అవికా గోర్ వేరొక వ్యక్తితో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.అవికా గోర్ మాట్లాడుతూ రాజ్ తరుణ్ మేము చాలా ఫ్రెండ్లీగా ఉండడంతో అంతా అలా ఇష్టం వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు అని తెలిపింది. కేవలం రాజ్ తరుణ్ మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో నవీన్ చంద్ర, నిఖిల్ వంటి హీరోలు కూడా నాకు మంచి స్నేహితులే.. కానీ రాజ్ తరుణ్ మాత్రం నాకు చాలా స్పెషల్ అని తెలియజేసింది.