హీరో అజిత్.. రజినీకాంత్, విజయ్ లను దాటేశాడు గా..?

Divya
తమిళ హీరో అజిత్ కుమార్ తాజాగా నటించిన చిత్రం వాలిమై.. ఈ సినిమా నిన్నటి రోజున ఎంతో గ్రాండ్ గా అన్ని భాషల లొ విడుదలైంది.. ఇందులో హీరోకి ఆపోజిట్ గా మరొక యువ హీరో కార్తీక్ కూడా నటించాడు.. ఇక ఈ సినిమా తమిళంలో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుంది.. అయితే ప్రారంభమైన మొదటి రోజే ఈ సినిమా 30 కోట్ల రూపాయల వరకు గ్రాస్ చేసినట్లుగా సమాచారం.. ఇక హీరో విజయ్ మాస్టర్, బిగిల్ వంటి సినిమాలతో పాటుగా.. రజనీకాంత్ నటించిన దర్బార్, రోబో 2.o వంటి సినిమాల కలెక్షన్లను కూడా అధిగమించినట్లు సమాచారం. ఇక వాలిమై సినిమా తమిళనాడులోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టింది ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు కూడా అజిత్ నటించిన విశ్వాసం సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది ఈ రెండు సినిమాలు దాదాపుగా మొదటి రోజు 17 కోట్ల రూపాయలను కలెక్ట్ చేశాయి.


ఇక తమిళనాడులో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. వాలిమై మూవీ 28 కోట్ల నుండి 32 కోట్ల వరకు క్రాస్ చేసింది అన్నట్లుగా సమాచారం. డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన సర్కార్ మూవీ తర్వాత ఈ సినిమాకి ఆల్ టైమ్ రికార్డు ఓపెనింగ్ గా నిలిచిందని సమాచారం.. ఇక అంతే కాకుండా ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే కరోనా మహమ్మారి ఉండి కూడా అజిత్ సినిమా ఇంతటి మంచి కలెక్షన్లు రాబట్టింది అంటే ఇక ఈ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉండాలో మనం అర్థం చేసుకోవచ్చు..

అలా తమిళనాడులో సరికొత్త రికార్డులను సృష్టించడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాబోయే రోజులలో ఈ సినిమానే అన్ని సినిమాలకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పవచ్చు. కానీ ప్రేక్షకుల, విమర్శకులను కారణంగా ఈ సినిమా రాత్రి సమయాలలో కాస్త తగ్గుదల అనిపించిందని తమిళనాట మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: