మాలీవుడ్ : ఆ సినిమాలకి టాలీవుడ్ ఫిదా ?

Purushottham Vinay
ఇక రెండు మూడేళ్లగా మాలీవుడ్ కంటెంట్ అనేది టాలీవుడ్ కి ఎలా డంప్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సూపర్ కంటెంట్ సినిమాలు తెలుగులో చాలా వేగంగా రీమేక్ అవుతున్నాయి.ఇక మన తెలుగు నెటివిటీకి తగ్గట్టు కొద్దిపాటి మార్పులు చేసి సక్సెస్ లు కొట్టేస్తున్నారు మన హీరోలు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా టాలీవుడ్ హంక్ రానా `భీమ్లా నాయక్` సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన `అయ్యప్పనుమ్ కోషియమ్` సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. మాతృకలో ఈ సినిమా పెద్ద సంచలన విజయం సాధించింది. ఈగో ఫ్యాక్టర్ ని ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అయితే మాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.ఇక ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ఈ సినిమా రీమేక్ అవుతోంది. ఇక మోహన్ లాల్ నటించిన `లూసీఫర్` సినిమాని కూడా తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసి నటిస్తోన్న సంగతి తెలిసిందే.


 `గాడ్ ఫాదర్` సినిమా టైటిట్ లో దీన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఇంకా `కప్పెలా`..డ్రైవింగ్ లైసెన్స్` అనే మరో రెండు మలయాళం సినిమాలు కూడా తెలుగులో రీమేక్ అవ్వడానికి ఇప్పుడు రెడీ అవుతున్నాయి.ఇక తాజాగా ఈ జాబితాలో `హృదయం` అనే సినిమా కూడా చేరింది. ప్రణవ్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన `హృదయం` సినిమా ఇటీవల విడుదలై మాలీవుడ్ లో పెద్ద విజయాన్ని సాధించింది. ఈనెల 18 వ తేదీన ఓటీటీ డీస్నీ హాట్ స్టార్ లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయినా సరే `హృదయం` సినిమాని తెలుగు దర్శక..నిర్మాతలు అసలు విడిచిపెట్టలేదు.ఓటీటీలో విడుదల అవుతున్నా ఎలాంటి సందేహాలకు తావు ఇవ్వకుండా ఈ సినిమాని రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.ఇక టాలీవుడ్ లో ని ఓ టాప్ ప్రొడక్షన్ హౌస్ `హృదయం`సినిమాని తెలుగు లో రీమేక్ చేయడానికి రెడీ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: