వావ్:మెగా హీరోతో మల్టీస్టారర్ చేయనున్న శ్రీ విష్ణు..!!
అయితే ఇప్పుడు తాజాగా ఈ హీరో ఒక మల్టీస్టారర్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యాడు అనే వార్త బాగా వైరల్ గా మారుతుంది. అల్లు శిరీష్ AK ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఒక సినిమాని నిర్మించేందుకు సిద్ధమయ్యాడనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మరొక హీరో అవసరం ఉందట.. ఇక ఆ స్థానంలో మరొక హీరో శ్రీ విష్ణు కూడా ఎంపిక చేసుకున్నారనే వార్త బాగా వినిపిస్తోంది. ఇక వీరిద్దరూ కలిసి ఈ సినిమాని ఓకే చెప్పినట్లుగా కూడా కొన్ని మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. థర్డ్ వే ప్రభావం కాస్త తగ్గగానే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారనే వార్త వినిపిస్తోంది.
మొదటి సారి ఒక మల్టీస్టారర్ మూవీని తీయబోయే అందుకు సిద్ధమయ్యాడు అల్లు శిరీష్.. కానీ మరొకవైపు శ్రీ విష్ణు మాత్రం ఇది వరకే కొంత మంది హీరోలతో కలిసి చేయడం జరిగింది.. ఇక శ్రీ విష్ణు కూడా తను నటించే సినిమాలు మంచి కథను ఎంచుకొని నటిస్తూ ఉంటాడు. తను హీరోగా కంటే ఒక యాక్టర్ గానే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక అల్లు శిరీష్ కూడా తన కెరీర్ మొదటి నుంచే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేయడం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఒక నటుడిగా పేరు పొందాలని తపనతో సినిమాలు చేస్తున్నాడు అన్నట్లుగా సమాచారం.