ఆ విషయంలో రాజమౌళి క్లీన్ బౌల్డ్..?

VUYYURU SUBHASH
అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన బడా బడా సినిమాలు అన్నీ మాయదారి మహమ్మారి కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. చరణ్-తారక్ కలిసి నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ..ప్రభాస్ హీరో గా నటిస్తున్న రాధ్యే శ్యాం రెండు సినిమాలు సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నాయి. దీంతో కిట కిట లాడాల్సిన ధియేటర్స్ బోసిపోయాయి. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ డే రోజు ఎన్నో ఫ్లెక్సీలు కట్టాలి..ఎంతో హంగామా చేయాలి అని భావించిన ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పక తప్పదు.

ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు బడా హీరోలు అయిన రాం చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా పై అభిమానులు ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. ఏకంగా 450 కోట్ల బడ్జెట్ తొ తెరకెక్కించిన సినిమా చూడాలని అభిమానులు పక్క ప్లానింగ్ తో ఉండగా..కరోనా టైమింగ్ ఫాలో అవ్వకుండా వచ్చేసి అందరి టైం ను  మార్చేసింది. ఇక రాజమౌళి అయితే ఈ సినిమా కోసం ఎప్పుడు చేయని విధంగా 50 రోజుల ముందు నుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. అంతేనా కేవలం ప్రమోషన్స్ కోసమే ఏకంగా 52 కోట్లు ఖర్చు చేసాడు అన్న టాక్ కూడా వినిపించింది.

ఇక మొన్నటి వరకు కూడా రాధే శ్యాం సినిమా వాయిదా పేయరు అనుకుంటూ వస్తున్న అభిమానులకు నేడు షాకింగ్ న్యూస్ చెప్పింది చిత్ర బృందం. మా సినిమా కూడా వాయిదా వేస్తున్నాం అంటూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో అటు మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ ను ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ ను తీవ్రంగా బాధపెడుతుంది ఈ రక్కాసి కరోనా. ఇక ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో తెలియక..వాయిదా పడ్డ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియక అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: