సాధారణంగా సెలబ్రిటీలు అయినా సామాన్య ప్రజలు అయినా కొత్త సంవత్సరం కొత్త లక్ష్యాన్ని పెట్టుకుని అదే లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇకపోతే కరోనా మహమ్మారి కారణంగా చాలామంది పోయినేడాది నటించిన సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక మరికొంతమంది హీరోయిన్లు తమ సినిమాలను విడుదల చేసుకున్నప్పటికీ తాము మాత్రం సక్సెస్ పొందలేదు. ఇక అందుకే ఎలా అయినా సరే ఈ ఏడాది సక్సెస్ పొందాలి అని.. ఇదే కాదు ఇక తమ లైఫ్ స్టైల్ కి సంబంధించి కూడా కొన్ని రిజల్యూషన్స్ ను తీసుకున్నారు మన సార్ హీరోయిన్స్. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా ఎవరెవరు ఎలాంటి రిజల్యూషన్ తో ముందుకు వచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. రాశీ ఖన్నా:
నటిగా ఒక మంచి మనసున్న వ్యక్తి గా .. మరింత బెటర్ గా ఉండాలని.. ఈ కొత్త ఏడాది తాను తీసుకున్న రిజల్యూషన్ ఇదేనని తెలిపింది రాశీ ఖన్నా. ఇక ఈమె మాట్లాడుతూ పోయిన ఏడాది సినిమాల ద్వారా సంతృప్తిగా అనిపించింది అని.. అద్భుతమైన ఛాన్సులు కూడా వచ్చాయని.. ఇక ఈ సంవత్సరం కూడా తానేమిటో నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తెలిపింది. అంతేకాదు కొత్త సంవత్సరంలో ఉన్నతంగా జీవించాలని అనుకోవడం తో పాటు ప్రపంచం పట్ల పాజిటివ్ గా ఉండటం అలాగే దక్కిన విషయంలో కృతజ్ఞతా భావంతో పని చేయడం ఇదే ఈ కొత్త సంవత్సరం రిజల్యూషన్ అంటూ ఆమె తెలిపింది.
2. పూజా హెగ్డే:
కొత్త సంవత్సరం కొన్ని కొత్త టార్గేట్లు పెట్టుకున్నానని ఖచ్చితంగా ఈ ఏడాది వాటన్నింటినీ నెరవేర్చుకుంటానని మీరు పూజ 2.0 ను చూడవచ్చు అని ఆమె తెలిపింది.
3. లావణ్య త్రిపాఠి:
ఇతరులతో పోల్చుకోకుండా తానేంటో కెరీర్లో దూసుకుపోవాలనీ అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది.
4. శివాని రాజశేఖర్:
కొత్త సంవత్సరం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని.. ఎన్ని అనుకున్నా జరగాల్సింది కచ్చితంగా జరుగుతుంది అని ఆమె తెలిపింది.
5. మీనాక్షి చౌదరి:
ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలిసింది అని .. వృత్తిని, ఆరోగ్యాన్ని బ్యాలెన్స్డ్ గా చూసుకోవడమే ఈ కొత్త సంవత్సరం రిజల్యూషన్ అని తెలిపింది.