వైరల్ : ఏపీ మంత్రి వ్యాఖ్యలకు కన్ఫ్యూషన్ లో పడ్డ టాలీవుడ్...!

murali krishna
తెలుగు సినిమా పరిశ్రమ పై ఏపీ ప్రభుత్వం కక్ష కట్టిందా అన్నట్లుగా పరిస్థితులు నడుస్తున్నాయని తెలుస్తుంది.. వకీల్‌ సాబ్‌ విడుదల అయిన అప్పటి నుండి కూడా ఈ పరిస్థితులు కొనసాగుతున్నాయని సమాచారం..

ప్రతి ఒక్కరు కూడా టాలీవుడ్‌ కి పూర్తి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని అంటున్నారట.. కాని ఏ ఒక్కరు కూడా ప్రభుత్వంకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు మాత్రం ముందుకు రావడం లేదని తెలుస్తుంది.. ఒక వేళ ముందుకు వచ్చినా కూడా వారిని ఏ స్థాయిలో వైకాపా నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని తెలుస్తుంది.. తాజాగా ఏపీకి చెందిన ఒక మంత్రి మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమ వల్ల ఏపీకి ఉన్న లాభం ఏంటీ.. ఎందుకు మేము భారీగా టికెట్ల రేట్లను పెంచి వారికి లాభం కలిగించాలి అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడని తెలుస్తుంది.ఇతర భాషల సినిమా లను మరో రాష్ట్రంలో విడుదల చేసిన సమయంలో అదనపు ట్యాక్స్ లను వసూళ్లు చేయడం జరుగుతుందట.ఇప్పుడు మరో రాష్ట్రంలో రూపొందుతున్న సినిమా లను మా రాష్ట్రంలో ఎందుకు పెద్ద మొత్తంలో టికెట్ల రేట్లు పెట్టి ప్రదర్శించాలి అంటూ ఆయన లాజిక్ ను తీశాడట.. ఆ మంత్రి పాయింట్‌ కు ఇప్పుడు టాలీవుడ్‌ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక జుట్టు పీక్కుంటుందని తెలుస్తుంది.

ఏపీ లో తెరకెక్కని సినిమాలు ఏపీ ప్రభుత్వంకు దక్కని ట్యాక్స్ ల వల్ల తెలుగు సినిమా అంటే ప్రభుత్వంకు కోపం అని క్లారిటీ వచ్చిందట.దాంతో ఇప్పుడు మంత్రి మాటలకు ఏమని కౌంటర్‌ ఇవ్వాలి అనే విషయమై ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారట.మొత్తానికి మంత్రి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నా ఆలోచనీయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.. టాలీవుడ్‌ మరియు ఏపీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ గొడవ ఎప్పటికి తీరబోతుందని ... అసలు మళ్లీ టికెట్ల రేట్లను పెంచేనా అనేది చర్చనీయాంశంగా మారిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: