వామ్మో:ఈసారి గట్టి హిట్ కొట్టేలా ఉన్న ఆదిసాయి కుమార్..!
ఇక టీజర్ విషయానికి వస్తే.. ఆది సాయి కుమార్ మొదటగా అభయ్ రామ్ అంటూ తన డైలాగ్ మొదలుపెడతారు.. ఆది ఈ సినిమాలో వాయిస్ ఓవర్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇక వీడియో విషయానికి వస్తే ప్రేయసితో కలిసి చాలా సంతోషంగా గడుపుతున్న సమయంలో.. ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల, అనుకోని సంఘటనలు ఎదురవుతాయి హీరోకి. ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది అనే విధంగా ఈ టీజర్ లో కనిపిస్తోంది.ఈ యువ హీరో సరికొత్త ప్రయోగం చేస్తున్నారని ఈ టీజర్ చూస్తే మనకి కనిపిస్తుంది.
ఇక ఈ మూవీ కూడా లవ్ అండ్, సస్పెన్స్ థ్రిల్లర్ తో తెరకెక్కించ బడుతోంది గనుక ఈ అతిథి దేవోభవ టీజర్ బాగా ఆసక్తి గా ఉంటోంది ప్రేక్షకులలో.ఇక ఈ మూవీకి స్టోరీ వేణుగోపాల్ రెడ్డి అందించారు. ఇక డైలాగులు మాత్రం రజని రాజాబాబు అందించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లుగా సమాచారం. త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు విడుదల చేస్తామని మేకర్ ప్లాన్ చేస్తున్నట్లు గా తెలియజేశారు. ఆది సరైన సక్సెస్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయికి చేరుకుంటుంది లేదా చూడాలి.