బర్తడే స్పెషల్: రానా గురించి తెలియని ఆసక్తికరమైన విషయాలు..!!
ఈ సినిమా చేస్తే తనకు మార్కెట్ ఉంటుందా లేదా అనే విషయం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయనకు కథ నచ్చిందంటే అది ఎలాంటి పాత్ర అయినా సరే చేయడానికి ఒప్పుకుంటాడు. ముఖ్యంగా రాణా లాగా సినీ ఇండస్ట్రీలో అన్ని పాత్రలలో నటించే నటులు చాలా తక్కువ మందే కనిపిస్తూ ఉంటారు. ఒకపక్క విలన్ గా.. మరో పక్క హీరోగా అదే సమయంలో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించడానికి ఇష్టపడుతూ ఉంటాడు.. నిజానికి రానా సినిమా నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు నిర్మాతగా వ్యవహరించాడు.
ఈయన బొమ్మలాట అనే సినిమాతో నిర్మాతగా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. యానిమేషన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు రానా. ఇక విజువల్ ఎఫెక్ట్స్ సమన్వయ కర్తగా దాదాపు 70 సినిమాలకు పైగా పనిచేసి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. లీడర్ సినిమాతో హీరో అయిన రానా అతి తక్కువ సమయంలోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. రెగ్యులర్ సినిమాలకు ఎప్పుడూ దూరంగా ఉంటూ ఏదో ఒక భిన్నత్వం ఉండేలా ప్రతి సినిమాలో చూసుకుంటూ ఉండటం గమనార్హం. ఇక ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాహుబలి సినిమాలో బల్లాల దేవుడి గా నటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన ఎన్నో పాత్రలు చేసి సంచలనాలు సృష్టించారు.