అదిరిందహె.. బాలయ్య సెంచరీ బన్ని ఆనందం?
మరోవైపు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో ప్రభుత్వం టిక్కెట్లు ధరలు ఒక్కసారిగా తగ్గించడం కూడా ఒక కారణం. అలా టికెట్ల ధరలు తగ్గించడం వల్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు కష్టాలు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇకపోతే కరోనా వైరస్ తర్వాత థియేటర్ లలో విడుదలైన మొదటి భారీ బడ్జెట్ సినిమా అఖండ . బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లో విడుదలయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
అయితే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల మధ్యే విడుదలైన అఖండ కలెక్షన్స్ ఒకవేళ 100 కోట్ల వసూళ్లు రాబట్టింది అంటే ఇక మరికొన్ని రోజుల్లో విడుదల కాబోయే పెద్ద సినిమాలకు ఇక ఇది ఒక బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకవేళ వంద కోట్ల కలెక్షన్స్ వస్తే సినిమా ఇండస్ట్రీ నిర్మొహమాటంగా తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగవచ్చు అని అంటున్నారు. కరోనా వైరస్ పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రారు అన్న భయంగానే.. ఏపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది అన్న భయం గాని.. ఒకవేళ అఖండ వంద కోట్లు సాధిస్తే.. ఇక మిగతా సినిమాలకు అవసరం లేదు అని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా బాలకృష్ణ సినిమా విజయం 17వ తేదీ విడుదల కాబోతున్న పుష్ప సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది.