ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

VAMSI
ప్రకాష్ రాజ్ తెలుగు సినీపరిశ్రమలో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న నటుడు. నవరసాలను తన అధీనంలో ఉంచుకున్న మహా నటుడు. సీన్ కు తగ్గ హావ భావాల్ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడంలో దిట్ట. తెలుగులో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్న ఈ నటుడు కర్ణాటక వాసి అని చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు. ఈయన అసలు పేరు ప్రకాష్ రాయ్ సినిమాల్లోకి వచ్చాక ప్రకాష్ రాజ్ గా మార్చుకున్నారు. ఈయన బెంగుళూరులో జన్మించారు. నాటకాలంటే ప్రాణం. అలా ఓ సినిమాలో అనుకోకుండా అవకాశం రావడంతో నాటకరంగం నుండి రంగుల లోకం సినీ ప్రపంచం లోకి అడుగుపెట్టారు.
జగపతి బాబు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా "సంకల్పం" అనే సినిమాలో నటించి మెప్పించారు. ఏ బాషలో నటించిన ఆ భాషను గౌరవిస్తూ ప్రేమించే ప్రకాష్ రాజ్..."సంకల్పం" సినిమా సమయంలోనే తెలుగు భాషను నేర్చుకుని పట్టు సాధించారు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "సుస్వాగతం" సినిమాలో ప్రకాష్ రాజ్ చేసిన మోనార్క్ పాత్ర అస్సలు ఎన్నటికీ మరువలేము. ఇందులో "నేను మోనార్క్ ని నన్ను ఎవరూ మోసం చేయలేరు" అంటూ ఈయన వాడే ఊతపదం బాగా పాపులర్ అయ్యింది. అలా తెలుగులో ఎన్నో పాత్రల్లో వైవిధ్యాన్ని చూపుతూ విలక్షణ నటుడిగా ముద్ర వేసుకున్నారు ప్రకాష్ రాజ్.
బొమ్మరిల్లు సినిమాలో  ఈయన పాత్ర ఎంతగా ఆడియన్స్ కి  కనెక్ట్ అయ్యింది అంటే కాస్త కటువుగా తల్లితండ్రులు వారి పిల్లలు బొమ్మరిల్లు ఫాదర్ అంటూ సరదాగా అంటుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకాష్ రాజు నటించిన ప్రతి సినిమాలోనూ ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉంది. తండ్రిగా, స్నేహితుడిగా, విలన్ గా ఇతరత్రా రోల్స్ లో...పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి నటించి సన్నివేశానికి ప్రాణం పోస్తారు. అందుకే మంచి పాత్ర ఏదైనా ఆయనను వెతుక్కుంటూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: