తగ్గేదేలే అంటున్న భోళా శంకర్ మేకర్స్.. ఎందులోనో తెలుసా?

VAMSI
మెగా కాంపౌండ్ నుండి ఫ్యాన్స్ కి ఎపుడు ఎదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అందుతునే ఉంటుంది. మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ పాన్ ఇండియా చిత్రాలతో దూసుకు వెళుతుంటే...తండ్రి చిరు వరుస వైవిధ్య భరిత చిత్రాలతో పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవలే ఆచార్య సినిమా పూర్తి చేసిన చిరు ఇపుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు పచ్చ జండా ఊపేసారు. మెగాస్టార్ చిరు, స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కనున్న "భోళా శంకర్" మూవీ షూటింగ్ కి నవంబర్ లో ముహూర్తం ఖరారు చేశారు. తమిళ చిత్రం వేదాలంకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడ సూపర్ హిట్ అందుకున్న ఈ స్టోరీని మన తెలుగు వారి టేస్ట్ కు తగ్గట్టుగా కాస్త మార్పులు చేసి కథను రెడీ చేయగా...కొన్ని కొత్త మలుపులు కూడా స్టోరీలో యాడ్ చేశారని వినికిడి.

దాంతో అభిమాులందరి లోనూ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయా అన్న ఈగర్ మరింత పెరుగుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అటు "గాడ్ ఫాదర్" షూటింగ్ ఆల్రెడీ షురూ కాగా, మరోవైపు దర్శకుడు బాబీతో మూవీ, ఇటు "భోళా శంకర్" ఇలా వరుసగా మూడు చిత్రాల షూటింగ్స్ తో ఫుల్ బిజీ బిజీ కానున్నారు మెగా స్టార్. ఇలా ఒకేసారి మూడు సినిమాలను లైన్ అప్ చేస్తూ ఫ్యాన్స్ కి లేటెస్ట్ అప్డేట్స్ ల వర్షం కురిపించనున్నారు.

భోళా శంకర్ చిత్రంలో రెండు డిఫరెంట్ స్టైల్స్ లో కనిపించనున్నారు చిరు. ఆ లుక్ చూస్తే గూస్ బమ్స్ రావాల్సిందే. ఇక పాత్ర కూడా మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతుందని అంటున్నారు.  చిరును అభిమానులకు నచ్చేలా సినిమాను అందించే విషయంలో తగ్గేదేలే అంటున్నారట మేకర్స్ . అదేనండి ఈ సినిమా కోసం ఎంత భారీ బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్న బడ్జెట్ కి మించినా పర్వాలేదు. కానీ సినిమా క్వాలిటీలో ఏ మాత్రం తగ్గేది లేదని అంటున్నారట. ప్రతి సీన్ ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: