వామ్మో.. మహేష్ ఎలా ఉన్నాడు ఏంటి.. ఫ్యాన్స్ షాక్?

praveen
ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో కుమ్మేసి ఉంటారు అనే డైలాగ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ గుర్తుండే ఉంటుంది.. సాధారణంగా స్టార్ హీరోల అందరి కి కూడా ఇలాంటి డైలాగ్ బాగా వర్తిస్తుంది. కానీ ఒక్క హీరో మాత్రం  ఈ వయసులో ఆ వయసులో అనే తేడా లేదు అన్ని వయసుల లో కూడా ఆరడుగుల అందగాడిగా..  మగువల మనసులు దోచే ఆజానుబాహుడుగా..  తెలుగు చిత్ర పరిశ్రమలో అందానికి కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు వయసు గురించి ఇప్పటికి ఎంతో మంది ప్రేక్షకులు అయోమయం లోనే ఉంటారు.

 ప్రస్తుతం మహేష్ బాబుకు 46 ఏళ్లు..  కానీ ఎక్కడ ఈ సూపర్ స్టార్ మాత్రం అలా కనిపించడు.  మహేష్ బాబుకు ఇప్పుడు 15 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. అయితే  కొడుకు పక్కన నిలబడితే మహేష్ బాబు అచ్చం తన కొడుకుకి అన్న లా కనిపిస్తాడు తప్ప ఎక్కడా తండ్రిలాగా కనిపించాడు.  అంతలా 46 ఏళ్ల వయసులో కూడా ఇంకా కుర్రాడి లాగే కనిపిస్తూ ఎంతోమంది మగువల మనసులను దోచేస్తున్నాడు. మహేష్ బాబు ఏజ్ ఎంత పెరుగుతున్నప్పటికీ ఆయన ముఖంలో ఎక్కడ వయసు పైబడుతున్న పోలికలు మాత్రం కనిపించవు.

 దీంతో మహేష్ బాబు ని చూస్తే రోజురోజుకు ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా అని ప్రేక్షకులు అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటారు.  ఇకపోతే ఇటీవల కాలంలో అయితే మహేష్ బాబు మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు.  ఎంతో స్టైలిష్ గా కాస్ట్యూమ్స్ వేసుకొని వరుసగా ఫోటోలు దిగుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు మహేష్ బాబు. ఈ ఫోటోలు చూసిన వారందరూ వామ్మో దేవుడు మహేష్ బాబుకు ఏమైనా వరం ఇచ్చాడా ఏంటి..  పదహారేళ్ళ వయసులో కూడా ఇంకా పాతికేళ్ళ కుర్రాడు లాగే కనిపిస్తున్నాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు.  ఇక దీనికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: